యమలీల’లో మొదట హీరో మహేష్ బాబు అట !

కమెడియన్ గా ఉన్న ఆలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ.కృష్ణారెడ్డి తీసిన సూపర్ హిట్ సినిమా ‘యమలీల’. కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్విగ్విజయంగా విజయవంతం అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో నేటికి ప్రేక్షకుల మదిలో సినిమా చిరస్థాయిగా నిలిచిపోయింది. పైగా చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డును కూడా సృష్టించి.. […]

Written By: admin, Updated On : October 7, 2020 6:15 pm
Follow us on


కమెడియన్ గా ఉన్న ఆలీని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీ.కృష్ణారెడ్డి తీసిన సూపర్ హిట్ సినిమా ‘యమలీల’. కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్విగ్విజయంగా విజయవంతం అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో నేటికి ప్రేక్షకుల మదిలో సినిమా చిరస్థాయిగా నిలిచిపోయింది. పైగా చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డును కూడా సృష్టించి.. చిన్న సినిమాల్లోనే భారీ సినిమాగా నిలిచింది.

Also Read: జోష్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గరమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

కమెడియన్ అలీని టాలీవుడ్ లో కొన్నాళ్ళపాటు హీరోగా రాణించేలా చేసింది ఈ సినిమా. తల్లి కోసం యముడ్ని కూడా ఎదిరించే కొడుకు పాత్రలో అలీ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. పైగా తల్లిని దేవతలా పూజించే కొడుకు కథ అవ్వడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాగా ఆదరించారు. ఇక గొప్ప సెంటిమెంట్ తో పాటు మధ్య మధ్యలో వచ్చే డీసెంట్ కామెడీ కూడా సినిమా స్థాయిని పెంచింది. ఇక యమధర్మరాజు గా కైకాల సత్యనారాయణ, చిత్ర గుప్తుడుగా బ్రహ్మానందం, తోట రాముడుగా తనికెళ్ళ భరణి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ సినిమాకి మొదట దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మహేష్ బాబును హీరోగా అనుకున్నారట.

Also Read: ప్రభాస్ కి కిల్లర్ ఫీస్ట్.. ఏమిటి నాగ్ అశ్విన్ ?

హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న సమయంలో సూపర్ స్టార్ కృష్ణకు విమానంలో కృష్ణా రెడ్డి ఈ కథను చెప్పాడట. కథ విన్న కృష్ణ కథ చాలా బాగుందని, కాకపోతే మహేష్ బాబు ఇప్పుడు సినిమా చేయడం కుదరదని, బాబు చదువుకుంటున్నాడని, చదువు పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుందని ఈ సినిమాని సూపర్ స్టార్ సున్నితంగా తిరస్కరించారట. ఇక హీరోగా ఎవరు అయితే బాగుంటుంది అని ఎస్వీ కృష్ణారెడ్డి ఆలోచిస్తున్న క్రమంలో ఆయనకు అలీ కనిపించారని.. క్యారెక్టర్ కి అలీ పెర్ఫెక్ట్ గా సరిపోతారని అందుకే అలీని పెట్టి ఈ సినిమా ఎస్వీ కృష్ణా రెడ్డి తీశారట. దాంతో ఎస్వీ కృష్ణారెడ్డిపై అనేక నెగిటివ్ కామెంట్స్ వచ్చాయట. ఓ కమెడియన్ తో చేస్తున్నావు.. నీ కెరీర్ దెబ్బ తింటుందని చాలామంది సలహా ఇచ్చినా.. వినకుండా ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసి సక్సెస్ కొట్టారు.