పవన్ కళ్యాణ్ -రానా భారీ మల్టీస్టారర్.. అసలు స్టోరీ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలతో బీజీగా మారిపోయారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. పవన్ ‘వకీల్ సాబ్’ చేస్తున్న సమయంలో పలు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు. Also Read: ప్రభాస్ కి కిల్లర్ ఫీస్ట్.. ఏమిటి నాగ్ అశ్విన్ ? పవన్ కల్యాణ్ వరుసగా క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ […]

Written By: NARESH, Updated On : October 8, 2020 10:20 am
Follow us on


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస మూవీలతో బీజీగా మారిపోయారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. పవన్ ‘వకీల్ సాబ్’ చేస్తున్న సమయంలో పలు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు.

Also Read: ప్రభాస్ కి కిల్లర్ ఫీస్ట్.. ఏమిటి నాగ్ అశ్విన్ ?

పవన్ కల్యాణ్ వరుసగా క్రిష్.. హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డిలతో మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు. పవన్ 26వ సినిమా ‘వకీల్ సాబ్’ సినిమా రాబోతుంది. #PSPK MOVIE-27గా క్రిష్ మూవీ.. #PSPK MOVIE-28గా హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీలు రాబోతున్నాయి. ఆ తర్వాత సురేందర్ రెడ్డితో ఈ మూవీ రాబోతుందనే టాక్ విన్పిస్తోంది. ఇక పవన్ 30వ సినిమా తివిక్రమ్ తో ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ సినిమాలు పట్టాలెక్కక ముందే పవన్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ తాజాగా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో రానా దగ్గుబాటి నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ ఈ మూవీకి ఓకే చెప్పగా రానా సైడ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చనే టాక్ వినిస్తోంది.

Also Read: జోష్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గరమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

పవన్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల మధ్యలోనే ‘అయ్యప్పన్ కోషియన్’ రీమేక్ రానుందట. అన్ని అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచే ఈ మూవీ షూటింగు ప్రారంభం అవుతుందని ఫిల్మ్ నగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ సినిమాల మధ్య వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో దగ్గుపాటి రానా నటిస్తాడో లేదో వేచిచూడాల్సిందే..! పవన్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.