మరీ ఇంత అన్యాయమా.. పాపం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ !

స్టార్ హీరోల సినిమాలను పంపణి చేస్తూ ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్. అయితే శివ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాకి స్పష్టం చేశాడు. ఇంతకు ఏమి జరిగిందయ్యా అంటే.. కొండారెడ్డి అనే వ్యక్తి కొంతమందిని పోగు చేసుకుని.. డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్ ను మాట్లాడదామని చెప్పి నిన్న ఉదయం శ్రీనగర్ […]

Written By: admin, Updated On : October 7, 2020 6:28 pm
Follow us on


స్టార్ హీరోల సినిమాలను పంపణి చేస్తూ ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్. అయితే శివ గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం నాలుగు బృందాలుగా విడిపోయి ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ మీడియాకి స్పష్టం చేశాడు. ఇంతకు ఏమి జరిగిందయ్యా అంటే.. కొండారెడ్డి అనే వ్యక్తి కొంతమందిని పోగు చేసుకుని.. డిస్ట్రిబ్యూటర్ శివ గణేష్ ను మాట్లాడదామని చెప్పి నిన్న ఉదయం శ్రీనగర్ కాలనీకి పిలిపించారు. అయితే మాట్లాడుతున్న మధ్యలోనే సడెన్ గా శివ గణేష్ ను బలవంతంగా ఎర్రమంజిల్ కు తీసుకువెళ్లి… అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో బంధించి దాదాపు గంటకు పైగా ఓ ల్యాండ్ వివాదంకు సంబంధించి అతన్ని బెదిరించారు.

Also Read: జోష్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. గరమవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

ఈ క్రమంలో శివ గణేష్ ను తుపాకులతో కాల్చేస్తామంటూ కొండారెడ్డి అతని అనుచరులు, శివ గణేష్ ను భయభ్రాంతులకు గురిచేశారట. అలా ప్రొద్దుటూరులో వున్న ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి రెండున్నర ఎకరాల పత్రాల పై శివ గణేష్ చేత బలవంతంగా సంతకం చేయించుకుని ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారట. మొత్తానికి ఎట్టకేలకు వారి నుండి బయట పడిన శివ గణేష్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి.. జరిగింది మొత్తం మొర పెట్టుకున్నాడు. కొండా రెడ్డి అతని అనుచరుల పై ఫిర్యాదు కూడా చేశాడు. కాగా శివ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల పై ప్రస్తుతం పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారని.. శివ గణేష్ మొత్తం పది మంది పైన ఫిర్యాదు చేశాడని, వారందర్నీ కస్టడీలో తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Also Read: ప్రభాస్ కి కిల్లర్ ఫీస్ట్.. ఏమిటి నాగ్ అశ్విన్ ?

అయితే ఈ సాయంత్రం కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్, సి.ఐ కళింగరావు ఎదుట పూర్తి వివరాలను తాజాగా కొండారెడ్డి వెల్లడించారు. పోలీసులు కొండారెడ్డి నుండి స్టేట్మెంట్ రికార్డ్ ను కూడా చేశారు. అలాగే కొండారెడ్డి అనుచరులను కూడా విచారించి మరిన్ని వివరాలు సేకరించి.. ఈ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో పూర్తిగా దర్యాప్తు చేసేలా పోలీసులు కసరత్తులు చేస్తున్నారట. ఏమైనా మరీ ఇంత అన్యాయమా.. పాపం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ !