Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంటాయి. కాబట్టి వాళ్లకు ఆటోమేటిగ్గా క్రేజ్ దక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన రాజమౌళి ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నంలో ఉన్నాడు… మహేష్ బాబు సైతం తనకి ఇష్టమైన కొన్ని పాత్రలను చేయడానికి తను ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. వారణాసి సినిమా తర్వాత తను ప్రొడ్యూసర్ గా మారి ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఆ సినిమాని ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ సినిమాలో ఆయన ఒక సూపర్ మాన్ గెటప్ లో మనకు కనిపించబోతున్నారట.
Also Read: మన్మోహన్ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్!
ఇక ఎప్పటినుంచో మహేష్ బాబు ఆ పాత్రను చేయాలని అనుకుంటున్నాప్పటికి ఆయనకు ఇప్పటివరకు వీలుపడలేదు. ఇక ఎలాగూ వారణాసి సినిమాతో ఆయనకు హాలీవుడ్ మార్కెట్లో మంచి పట్టు దొరుకుతుంది. కాబట్టి తనే ప్రొడ్యూసర్ గా మారి సినిమాను చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి నమ్రత సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటుంటే నమ్రత ఆ ప్రొడక్షన్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మహేష్ బాబు ఎందుకని అంత రిస్క్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అతను ఓకే అంటే చాలామంది ప్రొడ్యూసర్లు అతని సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు కదా ఆయనే ప్రొడ్యూసర్ గా మారడం ఎందుకు అనే డౌట్ ప్రతి ఒకరికి రావచ్చు.
కానీ మహేష్ బాబు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన హాలీవుడ్ మార్కెట్ పూర్తిగా పెరిగిపోతుంది. అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి రెమ్యూనరేషన్ రూపంలో డబ్బులు తీసుకునే కంటే తనే ఓన్ గా ప్రొడ్యూస్ చేసి వచ్చిన లాభం మొత్తాన్ని తనే తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట… ఇక ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
