Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli) తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదలు పెట్టుకొని రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం సమ్మర్ సెలవుల్లో మహేష్ బాబు తన ఫ్యామిలీ తో కలిసి విదేశాలకు వెళ్ళాడు. తిరిగి రావడానికి మరో నాలుగు వారాల సమయం ఉంది. ఈలోపు తదుపరి షెడ్యూల్ కోసం రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్స్ ని ఏర్పాటు చేశారట. సుమారుగా మూడు వేల మందితో ఒక భారీ పోరాట సన్నివేశాన్ని తదుపరి షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక విదేశాల్లో భారీ షెడ్యూల్స్ ని ప్లాన్ చేయబోతున్నారు. మొత్తం మీద రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో పని చేయబోతున్నాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Also Read : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం
ఆయన కోసం ముగ్గురు దర్శకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులో మొదటి వ్యక్తి సందీప్ రెడ్డి వంగ. రాజమౌళి తో షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘యానిమల్’ చిత్రాన్ని ముందుగా మహేష్ తోనే చెయ్యాలని అనుకున్నాడు కానీ, అంతటి వయొలెంట్ పాత్ర చేస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని మహేష్ బాబు భయపడ్డాడట. కానీ మారిన ట్రెండ్ ని బట్టి మహేష్ కూడా తన మైండ్ సెట్ ని మార్చుకున్నాడు. అందుకే తన తదుపరి చిత్రాన్ని సందీప్ వంగ తో ‘యానిమల్’ కంటే వయొలెంట్ చిత్రాన్ని చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సందీప్ వంగ తో పాటు బుచ్చి బాబు కూడా మహేష్ కోసం ఒక కథ ని సిద్ధం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘పెద్ది’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ తో చేయాలని అనుకుంటున్నాడు, మరి మహేష్ ఇతనికి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. వీళ్లిద్దరు మాత్రమే కాకుండా కల్కి దర్శకుడు నాగ అశ్విన్ కూడా మహేష్ కోసం ఒక కథ ని సిద్ధం చేశాడట. ప్రస్తుతం ఆయన ‘కల్కి’ సీక్వెల్ పై ప్రధానంగా ద్రుష్టి సారించాడు. ఈ సీక్వెల్ పూర్తి అయిన వెంటనే మహేష్ తో సినిమా చేయాలని ప్లాన్. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్స్ మహేష్ కోసం పోటీ పడుతున్నారు. మరి మహేష్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే మహేష్ తదుపరి చిత్రం సందీప్ వంగ తోనే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.