Mahesh Babu and Soundarya : హీరోగా మహేష్ బాబు మొదటి చిత్రం రాజకుమారుడు. దర్శకుడు రాఘవేంద్రరావు కే తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేయగా, కృష్ణ గెస్ట్ రోల్ లో అలరించాడు. మహేష్ బాబుకు జంటగా ప్రీతి జింటా నటించింది. 1999లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్. మహేష్ బాబును ప్రేక్షకులు అంగీకరించారు. మణిశర్మ సాంగ్స్ ఈ చిత్రానికి హైలెట్. కాగా రెండో చిత్రం వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో చేశాడు. యువరాజు టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సాక్షి శివానంద్, సిమ్రాన్ హీరోయిన్స్ గా నటించారు.
యువరాజు యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా సౌందర్యను అనుకున్నాడట వైవిఎస్ చౌదరి. మహేష్ తో జతకట్టేందుకు సౌందర్య సైతం ఒప్పుకుందట. సౌందర్య అప్పటికి పెద్ద స్టార్. మహేష్ బాబుకు ఇంకా స్టార్డం రాలేదు. మహేష్, సౌందర్యల మీద వైవిఎస్ చౌదరి లుక్ టెస్ట్ నిర్వహించాడట. మహేష్ పక్కన తనను చూసుకున్న సౌందర్య నిరాశ చెందారట. తన పక్కన తాను సెట్ కావడం లేదని ఆమె భావించారట. దాంతో యువరాజు ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట.
Also Read : మహేష్ బాబు తో కలిసి పోటీ పడి నటించే దమ్మున్న హీరో అతనొక్కడేనా..?
భవిష్యత్ లో కూడా మహేష్ బాబుకి జంటగా నటించకూడదని ఆమె ఫిక్స్ అయ్యారట. మహేష్ బాబు యువరాజు సినిమా నాటికి చాలా యంగ్. అలాగే ఫెయిర్నెస్ వలన అసలు వయసు కంటే చాలా తక్కువగా కనిపించేవాడు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలతో సినిమాలు చేస్తున్న సౌందర్య ఆయన పక్కన కొంచెం పెద్దగా కనిపించి ఉండొచ్చు. అది ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా సౌందర్య యువరాజు ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు అనేది ఒక అంచనా.
సౌందర్య అకాల మరణం పొందిన సంగతి తెలిసిందే. 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు సౌందర్య బీజేపీ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ కుప్పకూలింది. ఆ విమాన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు కన్నుమూశారు. సిల్వర్ స్క్రీన్ పై అజరామరమైన పాత్రలు చేసిన సౌందర్య.. అభిమానులను శోక సముద్రంలో ముంచిపోయారు. సౌందర్య మరణం నేపథ్యంలో షూటింగ్ మధ్యలో ఉన్న నర్తనశాల ఆగిపోయింది. నర్తనశాలలో బాలకృష్ణ నటించి దర్శకత్వం వహించాలి అనుకుంటారు.
Also Read : హీరోయిన్ సౌందర్య వల్లనే మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదాలు నెలకొన్నాయా..? ఆలస్యంగా బయటపడిన సంచలన నిజాలు!