Mahesh Babu : మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు మంచి విజ్యాలను సాధించాయి. వాటిలో పోకిరి (Pokiri), శ్రీమంతుడు (Sri Manthudu) లాంటి రెండు సినిమాలతో మహేష్ ఇండస్ట్రీ హిట్లను నమోదు చేశాడు. ఇక నటనలో కూడా చాలా వరకు పరిణితిని చూపిస్తూ ప్రతి ఎమోషన్ ను పర్ఫెక్ట్ గా పండించే హీరోల్లో మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఒకరిని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తను చేసిన ప్రతి పాత్రకి న్యాయం చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ కి ఏం కావాలో తెలుసుకుని దాన్ని అందించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. అందుకే మహేష్ బాబు అంటే చాలామంది దర్శకులు ఇష్టపడుతుంటారు. ఇక తన అభిమానులు కానీ, ప్రేక్షకులు కానీ ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ప్రస్తుతం రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన డైరెక్ట్ గా హాలీవుడ్ లో కూడా సినిమా చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే మహేష్ బాబు హాలీవుడ్ హీరోల కంటే కూడా చాలా అందంగా ఉంటాడు. అందువల్ల వాళ్ళు సైతం అతన్ని వాళ్ళ హీరోగా ఓన్ చేసుకొని మరి స్ట్రైయిట్ గా ఆయనతో హాలీవుడ్ సినిమాని కూడా చేసే అవకాశాలైతే ఉన్నాయి…
Also Read : మహేష్ కి విలన్ గా స్టార్ హీరో, అలా హింట్ ఇచ్చేశాడా? రాజమౌళి ఛాయిస్ అదుర్స్!
ఇక మహేష్ బాబు లాంటి నటుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి మహేష్ బాబు తో పాటు నటనలో పోటీపడే కెపాసిటీ ఒక జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఉందని మిగతా హీరోలు ఎవ్వరు కూడా తనకు యాక్టింగ్ పరంగా పోటీకి రారని చాలా మంది సినిమా మేధావులు చెబుతున్నన్నారు.
కానీ రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) సైతం చాలా మంచి నటనతో యావత్ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), మహేష్ బాబు(Mahesh Babu) మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. ఇక వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని యావత్ సినిమా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికి అది వర్కౌట్ అయితే అవ్వడం లేదు.
నిజానికి ఒకప్పుడు మహేష్ బాబు కి నటన పరంగా పోటీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి వారు సైతం మహేష్. కి నటనలో మంచి పోటీని ఇస్తు ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
Also Read : ఒడిషా అడవుల్లోకి రాజమౌళి-మహేష్ బాబు.. ఏం జరుగుతోంది.?