Allu Arjun And Atlee
Allu Arjun And Atlee: పుష్ప 2 సక్సెస్ హ్యాంగ్ ఓవర్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సన్నద్ధం అవుతున్నాడు. ఆయన విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ స్టార్ దర్శకుడైన అట్లీకి అల్లు అర్జున్ పచ్చ జెండా ఊపాడట. గతంలో అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో మూవీ అంటూ కథనాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు అది సాకారం అయ్యింది. అట్లీ గత చిత్రం జవాన్. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Also Read: జీవితంలో మహేష్ బాబుతో నటించకూడదని ఫిక్స్ అయిన సౌందర్య.. కారణం ఏమిటో తెలుసా?
మరోవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకు ఎక్కింది. పుష్ప 2 రూ. 1800 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా నార్త్ లో పుష్ప 2 వసూళ్ల సునామీ సృష్టించింది. ఇద్దరు సక్సెస్ఫుల్ స్టార్స్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా అట్లీ-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేమిటో చూద్దాం.
ఈ మూవీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అట. ఈ కథను అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని దృష్టిలో పెట్టుకుని రాశాడట. అయితే బడ్జెట్ పరిమితుల రీత్యా సల్మాన్ తో కుదరలేదట. వరుస పరాజయాల్లో ఉన్న సల్మాన్ ఖాన్ మార్కెట్ దెబ్బతింది. ఆయనకు రెండు మూడు వందల కోట్ల వసూళ్లు కష్టం అవుతుంది. ఇండియా వైడ్ మార్కెట్ ఉన్న అల్లు అర్జున్ ఈ భారీ ప్రాజెక్ట్ కి సరైన ఎంపిక అని అట్లీ భావిస్తున్నాడట. మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఏమిటంటే.. ఈ మూవీలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడట.
ఓ కీలక రోల్ స్టార్ హీరో చేస్తాడట. అందుకు తమిళ హీరో శివ కార్తికేయన్ ని అనుకుంటున్నారట. ఆయన నటించే అవకాశం మెండుగా ఉందని అంటున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. అట్లీ ప్రాజెక్ట్ అనంతరం త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీ చేస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదట స్టార్ట్ చేయాలి. ఈ ఏడాది ద్వితీయార్థంలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్టు పై ప్రకటన ఉంటుందట.
Also Read: బిగ్ బాస్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ.. తన ఒపీనియన్ చెప్పిన రౌడీ హీరో!
Web Title: Interesting update about allu arjun atlee movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com