https://oktelugu.com/

Mahesh Babu : రెండు నెలలు కూడా దర్శకులు వెయిట్ చేయలేరా? సుకుమార్‌పై మహేశ్ ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. కారణం అదేనా?

డైరెక్టర్ వంశీ, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మహర్షి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మహేశ్‌తో చేయడానికి వంశీ దాదాపుగా రెండేళ్లు ఎదురు చూశారని, ప్రస్తుతం ఉన్న దర్శకులకు అన్ని ఏళ్లు ఎదురు చూసే ఓపిక లేదని మహేశ్ బాబు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. అయితే కేవలం వంశీ పేరు మాత్రమే చెప్పి సుకుమార్, పూరీ జగన్నాథ్ పేర్లు చెప్పకపోవడంతో ఇది కాస్త కాంట్రావర్సీలకు దారితీసింది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2024 / 07:33 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu :  సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా ఆశించినంత టాక్ సంపాదించుకోలేదు. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రెండు పార్ట్‌లా లేకపోతే ఒక పార్ట్? అనే వివరాలు ఇంకా రావాల్సి ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బడ్జెట్ రూ.1500 కోట్లు అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు మహేశ్ బాబు ఇంకా ఏ సినిమా కూడా చేయకూడదనే కండీషన్ కూడా రాజమౌళి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్1, పార్ట్2 ఎంత హిట్ అయ్యాయో మీకు తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాను సుకుమార్ మహేశ్ బాబుతో చేయాల్సింది. కానీ మహేశ్ సినిమాకి నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పుష్ప స్టోరీని సుకుమార్ మొదటిగా మహేశ్ బాబు దగ్గరికి వెళ్లి చెప్పగా.. మాస్ క్యారెక్టర్‌ అని నో చెప్పారట. దీంతో సుకుమార్ ఆ కథను అల్లు అర్జున్‌కి చెప్పారు. వెంటనే అల్లు అర్జున్ ఒకే చెప్పడంతో తెరపైకి వచ్చింది.
    డైరెక్టర్ వంశీ, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన మహర్షి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మహేశ్‌తో చేయడానికి వంశీ దాదాపుగా రెండేళ్లు ఎదురు చూశారని, ప్రస్తుతం ఉన్న దర్శకులకు అన్ని ఏళ్లు ఎదురు చూసే ఓపిక లేదని మహేశ్ బాబు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలిపారు. అయితే కేవలం వంశీ పేరు మాత్రమే చెప్పి సుకుమార్, పూరీ జగన్నాథ్ పేర్లు చెప్పకపోవడంతో ఇది కాస్త కాంట్రావర్సీలకు దారితీసింది. సుకుమార్‌ను ఉద్దేశించే మహేశ్ బాబు అన్నారని, ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ వేశారని అప్పట్లో పెద్ద చర్చ అయ్యింది. ఇప్పటికీ ఈ చర్చ నడుస్తోందనుకోండి. అయితే ఆ తర్వాత మహేశ్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా సుకుమార్‌ను ఉద్దేశించి అనలేదని తెలిపారు. తన కోసం వంశీ ఎదురు చూశాడని చెప్పిన అంతే కానీ సుకుమార్‌కు ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ వేయలేదన్నారు.
    కొందరు వేరే సినిమాలతో బిజీగా ఉంటారు. కథ చెప్పిన వెంటనే ఒకే చేయలేరు కదా. ఎందుకంటే ఇతర సినిమా డేట్ల వల్ల రెండు నుంచి మూడు నెలల వెయిట్ చేయాలని చెబుతుంటారు. పుష్ప సినిమా విషయంలో కూడా సేమ్ ఇలానే జరిగిందని మహేశ్ అన్నారు. సుకుమార్ పుష్ప స్టోరీని చెప్పిన తర్వాత షెడ్యూల్ కుదరక కొన్ని రోజులు ఆగాలని మహేశ్ కోరారట. కానీ సుకుమార్ ఆగకుండా వెంటనే అల్లు అర్జున్‌తో సినిమా తీశారని మహేశ్ తెలిపారు. సుకుమార్‌కి ఎలాంటి కౌంటర్ వేయలేదని క్లారిటీ ఇచ్చారు.