https://oktelugu.com/

Allu Arjun: ‘పుష్ప’ చిత్రంలో ఆ స్టెప్పు జానీ మాస్టర్ కంపోజ్ చెయ్యలేదు..క్రెడిట్స్ కోసం అలా చేశాడంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్!

సాధారణ ప్రేక్షకులు చేయడం కామన్, కానీ స్టార్ సెలెబ్రిటీలు , క్రికెట్ సెలెబ్రిటీలు కూడా ఆ స్టెప్పుని వేయడం అనేది మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని మాత్రమే చెప్పగలం. అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 20, 2024 / 07:04 PM IST

    Allu Arjun(5)

    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన పలికిన డైలాగ్స్, చేసిన మ్యానరిజమ్స్, వేసిన డ్యాన్స్ స్టెప్స్ ని వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు అనుకరిస్తూ వస్తున్నారు. గడిచిన రెండు దశాబ్దాలలో ఇండియన్స్ ని ఒక సినిమా ఇంతలా ప్రభావితం చేయడం మనం చూడలేదు. స్టోరీ వల్లో, లేదా డైరెక్టర్ టేకింగ్ వల్లో సినిమాలు ఆడడం ఇన్నాళ్లు మనమంతా చూసాము. కానీ కేవలం హీరో వల్ల ఆడిన ‘పుష్ప’ లాంటి సినిమాలు చాలా అరుదుగా చూస్తుంటాము. ఇదంతా పక్కన పెడితే పార్ట్ 1 లో ‘చూపే బంగారమాయెనే..శ్రీవల్లీ’ అంటూ సాగే పాట అప్పట్లో మన ఇండియన్స్ కి ఎలాంటి కిక్ ని ఇచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన ట్రేడ్ మార్క్ స్టెప్పు చూసే ఆడియన్స్ చాలా తేలికగా అనిపించడంతో ప్రతీ ఒక్కరు ఆ స్టెప్పుని అనుసరిస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు.

    సాధారణ ప్రేక్షకులు చేయడం కామన్, కానీ స్టార్ సెలెబ్రిటీలు , క్రికెట్ సెలెబ్రిటీలు కూడా ఆ స్టెప్పుని వేయడం అనేది మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం అల్లు అర్జున్ మ్యాజిక్ అని మాత్రమే చెప్పగలం. అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ జానీ మాస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు అల్లు అర్జున్ ఈ చిత్రంలో పాపులరైన చెప్పు స్టెప్పు ఎలా పుట్టిందో ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ అయ్యింది. దీని గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ పాట కంపోజ్ చేస్తున్న సమయంలో నా చెప్పు జారీ క్రింద పడిపోయింది. దానిని నేను ఒక స్టైల్ తో తీసుకొని సరి చేసుకున్నాను. ఎదో యాదృచ్చికంగా నేను చేసిన ఆ పని జానీ మాస్టర్ కి బాగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఆ పాటలో వేరే స్టెప్పులు కంపోజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా, జానీ మాస్టర్ పర్లేదు సార్ నాకు ఆ స్టెప్పు బాగా నచ్చింది. దానినే వాడుకుందాం అని అన్నాడు. ఇంకా కష్టమైన స్టెప్పు ఇచ్చి ఉండుంటే ఆయనకి క్రెడిట్స్ వచ్చేవి. కానీ మాస్టర్ ఆ పని చెయ్యలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ కి అయన కేవలం ఈ ఒక్క స్టెప్పు మాత్రమే కాదు, ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలో ‘బుట్ట బొమ్మ’ లాంటి అద్భుతమైన పాటని కూడా అందించాడు. ఈ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన హుక్ స్టెప్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అలా అల్లు అర్జున్ కెరీర్ లో గుర్తుండిపోయే స్టెప్పులు వేయించాడు జానీ మాస్టర్. అయితే ఇప్పుడు ఆయన జైలు కి వెళ్ళడానికి కారణం అల్లు అర్జున్ అని సోషల్ మీడియా లో కొంతమంది అసత్య ప్రచారాలను చేస్తున్న సంగతి తెలిసిందే.