spot_img
Homeఎంటర్టైన్మెంట్షాకింగ్: మహేష్ ఎన్నడూ ఒక హీరోయిన్ పై ఇలాంటి కామెంట్ చేయలేదు!

షాకింగ్: మహేష్ ఎన్నడూ ఒక హీరోయిన్ పై ఇలాంటి కామెంట్ చేయలేదు!

క్రేజీ బ్యూటీ సాయి పల్లవికి అభిమానులే కాదు, స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, సాయి పల్లవి నటన గురించి ట్వీట్ చేస్తూ.. ‘సాయిపల్లవి ఎప్పటిలాగే ‘లవ్ స్టోరి’తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. సినిమాలో ఆమె డ్యాన్స్ చూశాకా, అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా అన్న సందేహం కలిగింది. ఇప్పటివరకూ స్క్రీన్‌ పై ఆమెలా డ్యాన్స్‌ చేసేవాళ్లని నేను ఇంతవరకు చూడలేదు’ అంటూ మహేష్.. సాయి పల్లవి గురించి పొగుడుతూ ట్వీట్ చేశారు.

Mahesh Babu reviews Naga Chaitanya and Sai Pallavi's Love Story

మహేష్ గతంలో ఎన్నడూ ఒక హీరోయిన్ గురించి ఎప్పుడు ఇంతలా ట్వీట్ చేయలేదు. అందుకే, ఈ ట్వీట్ ను అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవికి ఫిదా అయ్యామని ఏకంగా మెగస్టార్ చిరంజీవే పబ్లిక్ గా చెప్పిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి గురించి చిరు మాటల్లో.. ‘ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది.

అయితే ఆమెతో డాన్స్ నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆమె చేసిన సారంగ దరియా సాంగ్ కోసమైనా నేను “లవ్ స్టోరి” సినిమాని రెండు మూడు సార్లు చూస్తాను’ అని మెగాస్టార్ చెప్పారు అంటే అది సాయి పల్లవి టాలెంట్ కి దక్కిన గౌరవమే. సాయి పల్లవికి సౌత్ స్టార్లే కాదు, ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఫిదా అయిపోయాడు.

అమీర్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ‘ఆమె పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. పాటల్లోని ఆమె డ్యాన్స్ చూసి.. నేను సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను’ అంటూ అమీర్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సాధారణ హీరోయిన్ కి ఈ రేంజ్ లో ఇండియన్ సూపర్ స్టార్లు ఫిదా అవ్వడం నిజంగా విశేషమే.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Oktelugu Epaper