
సమంత-నాగచైతన్య ప్రేమలో పడ్డారన్నప్పుడు, పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించినప్పుడు ఎంత సెన్సేషన్ అయ్యిందో.. ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోతున్నారన్న ప్రచారాన్నిచూసీ అంతే సంచలనం నమోదవుతోంది. తొలి సినిమాతోనే ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఆ తర్వాత జీవితంలోనూ ఒక్కటై అందరికీ షాకిచ్చారు. సంతోషకరమైన విషయమే కాబట్టి.. జనం కూడా ఆశీర్వదించారు. మొన్నటికి మొన్న ‘ఆహా’లో ప్రసారమైన ‘సామ్ జామ్’ లోనూ సమంత-చైతూ జోడీనే అందరినీ ఆకట్టుకుంది.
అంతా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో ఉన్నట్టుండి షాకిచ్చింది సామ్. సోషల్ మీడియాలో తన పేరు చివర ఉన్న ‘అక్కినేని’ ఇంటి పేరును తొలగించి సంచలనానికి తెరతీసింది. ఇది చూసిన వాళ్లంతా సమంత-చైతూ మధ్య విభేదాలు వచ్చాయని, అక్కినేని పేరు తొలగించడం అందులో భాగమేనని చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఆ విషయమై అటు సమంత గానీ.. ఇటు చైతూ కానీ స్పందించకపోవడంతో అనుమానాలు రెట్టింపయ్యాయి.
ఆ తర్వాత.. సోషల్ మీడియాలో మరో ‘బ్రేకప్ స్టోరీ’స్ పెట్టేస్తూ సందేహాలను కంటిన్యూ చేసింది సామ్. ఈ విషయమై ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఇలాంటి వార్తలపై తాను ఎప్పుడూ స్పందించబోనని చెప్పింది. ఇప్పుడు కూడా స్పందించాలని అనుకోవట్లేదని చెప్పిన సమంత.. తనకు ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే.. అప్పుడు మాట్లాడుతానని చెప్పింది. మొన్నటికి మొన్న తిరుమలలో వీరి దాంపత్యంపై వస్తున్న రూమర్లపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధిని తిట్టేసి.. దాదాపు కన్ఫామ్ చేసినంత పనిచేసింది.
ఈ విధమైన అప్డేట్స్ తో సమంత-చైతూ ఫ్యామిలీ వివాదం నిత్యం వార్తల్లో నలుగుతోంది. ఈ సమయంలోనే మరో టాపిక్ బయటకు వచ్చింది. ‘ఏమాయ చేసావే’ చిత్రంతో ప్రేమలో పడిన వీరిద్దరూ.. ఆ తర్వాత చాలా కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. పబ్బులు, పార్టీలు అంటూ ఎంజాయ్ చేశారట. ఈ సమయంలో వీరిద్దరికీ సంబంధించిన పర్సనల్ ఫొటోలు కొన్ని లీకయ్యాయట. వాటిని చేజిక్కించుకున్న కొందరు ఆకతాయిలు.. వాటిని ఆన్ లైన్లో పెడతామని నాగార్జునను బెదిరించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో.. ఈ ఫొటోలు బయటకు రాకుండా ఉండేందుకు నాగార్జున కొన్ని లక్షలు ధారపోశాడని వార్తలు వస్తున్నాయి. సెలబ్రిటీలుగా ఉన్నవారు పరువు, మర్యాద వంటి అంశాలకు ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తారో తెలియనిది కాదు. ఈ కోణంలోనే ఆకతాయిలు అడిగినంత డబ్బును నాగ్ ఇచ్చాడనే వార్తలు కొన్ని మీడియా సంస్థల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఈ వార్తల్లో నిజమెంత? అన్నది చూడాలి.