క్రేజీ బ్యూటీ సాయి పల్లవికి అభిమానులే కాదు, స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, సాయి పల్లవి నటన గురించి ట్వీట్ చేస్తూ.. ‘సాయిపల్లవి ఎప్పటిలాగే ‘లవ్ స్టోరి’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాలో ఆమె డ్యాన్స్ చూశాకా, అసలు ఆమెకు ఎముకలు ఉన్నాయా అన్న సందేహం కలిగింది. ఇప్పటివరకూ స్క్రీన్ పై ఆమెలా డ్యాన్స్ చేసేవాళ్లని నేను ఇంతవరకు చూడలేదు’ అంటూ మహేష్.. సాయి పల్లవి గురించి పొగుడుతూ ట్వీట్ చేశారు.

మహేష్ గతంలో ఎన్నడూ ఒక హీరోయిన్ గురించి ఎప్పుడు ఇంతలా ట్వీట్ చేయలేదు. అందుకే, ఈ ట్వీట్ ను అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవికి ఫిదా అయ్యామని ఏకంగా మెగస్టార్ చిరంజీవే పబ్లిక్ గా చెప్పిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి గురించి చిరు మాటల్లో.. ‘ఫిదాలో సాయి పల్లవి టైమింగ్, డాన్స్ టాలెంట్, ఎనర్జీ చూసి ఎవరీ అమ్మాయి అని ఆశ్చర్యపోయాను. ఆమె లాంటి వండర్ ఫుల్ డాన్సర్ తో హీరోగా డాన్సులు చేయాలని ఉంది.
అయితే ఆమెతో డాన్స్ నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆమె చేసిన సారంగ దరియా సాంగ్ కోసమైనా నేను “లవ్ స్టోరి” సినిమాని రెండు మూడు సార్లు చూస్తాను’ అని మెగాస్టార్ చెప్పారు అంటే అది సాయి పల్లవి టాలెంట్ కి దక్కిన గౌరవమే. సాయి పల్లవికి సౌత్ స్టార్లే కాదు, ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఫిదా అయిపోయాడు.
@Sai_Pallavi92 sensational as always… does the lady have any bones??? Haven’t seen anyone dance like this ever on screen!!! Moves like a dream 🤩🤩🤩
— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021
అమీర్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. ‘ఆమె పాటలు కొన్ని యూట్యూబ్ లో చూశాను. పాటల్లోని ఆమె డ్యాన్స్ చూసి.. నేను సాయి పల్లవికి ఫ్యాన్ అయ్యాను’ అంటూ అమీర్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సాధారణ హీరోయిన్ కి ఈ రేంజ్ లో ఇండియన్ సూపర్ స్టార్లు ఫిదా అవ్వడం నిజంగా విశేషమే.