Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాలు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నా ఈ తరం యంగ్ దర్శకులందరికంటే కూడా పూరి జగన్నాథ్ చాలా బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తక్కువ రోజుల్లోనే సినిమాలను చేసి ఇండస్ట్రీ హిట్లను సాధించేవాడు. మరి ఇలాంటి సందర్భంలో ప్రొడ్యూసర్స్ కి భారీ లాభాలు రావడమే కాకుండా ప్రొడక్షన్ ఖర్చు కూడా చాలా వరకు తగ్గించేవాడు. ఇక మహేష్ బాబుతో ఆయన చేసిన పోకిరి (Pokiri) సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా అటు మహేష్ బాబుకి, ఇటు పూరి జగన్నాథ్ కి ఇద్దరికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చింది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మేన్ (Bussiness Men) సినిమా సైతం మహేష్ బాబు కెరీర్ లోనే అత్యుత్తమమైన సినిమాగా నిలిచిపోయింది.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
మహేష్ బాబుకు ఆయన చేసిన సినిమాల్లో నచ్చిన అతి కొన్ని సినిమాల్లో బిజినెస్ మేన్ సినిమా ఒకటని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా కూడా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా పట్టలైతే ఎక్కలేదు.
దానికి కారణం ఏంటి అంటే పూరి జగన్నాధ్ ఛార్మి తో కలిసి ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేయడం వల్లే మహేష్ బాబు పూరి తో సినిమాలను చేయలేకపోయారట. కారణమేంటంటే వీళ్ళ సినిమాల విషయంలో ఛార్మి ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువవుతుంది. అందువల్లే పూరితో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేదట. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఫ్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఎవరు కూడా సాహసం చేయట్లేదు.
దాంతో తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి తో ఆయన సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…