Mahesh Babu: దర్శక ధీరుడిగా గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు (Mahesh Babu) ని హీరోగా పెట్టి ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. మొదటి షెడ్యూల్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన సినిమా యూనిటీ సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేద్దామనే లోపే మహేష్ బాబు ఇటలీ వెళ్ళాడు.మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి సైతం ఇప్పుడు జపాన్ వెళ్ళాడు. ఇక వీళ్ళు విదేశాల చుట్టూ తిరుగుతుంటే సినిమా యూనిట్ మాత్రం ఈ మూవీ కి సంబంధించిన షెడ్యూల్ ని ప్లాన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
వీళ్ళిద్దరూ తిరిగి వచ్చి సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్నారట…ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా మారాయి. ఈ సినిమా స్టోరీ ఏంటి? సినిమా ఎలా ఉండబోతుంది లాంటి విషయాలు ఏమీ కూడా రాజమౌళి జనాలకి తెలియజేయడం లేదు.
కాబట్టి ఈ సినిమా మీద కొంతమందికి అంచనాలు ఉంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి చూసుకుందాంలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమాకి మార్కెట్ లో మంచి బజ్ ఉన్నప్పటికి దానిని వాడుకోవడానికి రాజమౌళి సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ గాని, గ్లింప్స్ గాని రిలీజ్ చేయాలి.
లేదంటే కనీసం ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన స్టోరీ ఏంటి ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలను క్లియర్ కట్ గా చెబితే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఈ సినిమాని వాళ్ళు పట్టించుకునే అవకాశాలు కూడా లేకుండా పోయే ప్రమాదమైతే ఉంది…