Mahesh babu and Rajamouli : రాజమౌళి-మహేష్ బాబు కెరీర్లో మొదటిసారి చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో SSMB 29 తెరకెక్కుతుంది. 2025 ఆరంభంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ వెంటనే షూటింగ్ మొదలుపెట్టారు. లాంచింగ్ సెరిమోని సైతం రహస్యంగా జరిపారు. మీడియాను అనుమతించలేదు. హైదరాబాద్ శివారులో గల అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక, రాజమౌళి-మహేష్ బాబు మీడియా ముందుకు వస్తారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
SSMB 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందని టీం తెలియజేశారు. ఈ పాత్ర కోసం మహేష్ షాకింగ్ మేకోవర్ అయ్యారు. ఎన్నడూ లేని విధంగా లాంగ్ హెయిర్, గడ్డంతో నటిస్తున్నారు. జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న మహేష్ బాబు వీడియో ఒకటి ఇటీవల లీకైంది. మహేష్ సింహంలా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేశారు. ఇక మహేష్ బాబుకు జంటగా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ లేడీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ఆమెకు గ్లోబల్ ఫేమ్ ఉన్న నేపథ్యంలో రాజమౌళి హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఇక మహేష్ బాబుకు విలన్ ఎవరనే చర్చ జోరుగా సాగుతుంది. పలువురు స్టార్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. తమిళ్ స్టార్ విక్రమ్, హీరో గోపీచంద్ లను కూడా రాజమౌళి సంప్రదించాడని కథనాలు వెలువడ్డాయి.
మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాగా ఆయన SSMB 29 లో విలన్ రోల్ చేస్తున్నాడనే వాదనకు బలం చేకూర్చేలా ఆయన లేటెస్ట్ కామెంట్స్ ఉన్నాయి. కమిట్ అయిన అన్ని చిత్రాల షూటింగ్స్ పూర్తి చేశాను. ఓ బడా మూవీలో నటిస్తున్నాను. ఆ మూవీలో నా పాత్రకు రాసిన భారీ డైలాగ్స్ చూస్తుంటే భయం వేస్తుంది, అని రాసుకొచ్చారు. తన మూవీలో నటించే హీరో, ఇతర ప్రధాన పాత్రలు చేసే నటులు.. ఇతర సినిమాల్లో నటించడానికి రాజమౌళి అంగీకరించరు. కాబట్టి మిగతా సినిమా షూటింగ్స్ పూర్తి చేసిన పృథ్విరాజ్, SSMB 29కి సన్నద్ధం అవుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ ని ఉద్దేశించే సోషల్ మీడియా పోస్ట్ చేశాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read : రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు