Homeఎంటర్టైన్మెంట్Nayanthara: నా జీవితం తెరిచిన పుస్తకం, ప్లీజ్ అలా పిలవొద్దు.. నయనతార సంచలన లేఖ!...

Nayanthara: నా జీవితం తెరిచిన పుస్తకం, ప్లీజ్ అలా పిలవొద్దు.. నయనతార సంచలన లేఖ! ఇంతకీ అందులో ఏముంది?

Nayanthara: నయనతార జీవితం వివాదాలమయం. కేరళకు చెందిన ఈ భామ ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ గా ఎదిగింది. చంద్రముఖి, గజిని వంటి చిత్రాలు ఆరంభంలో ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. కోలీవుడ్ వేదికగా ఆమె స్టార్డం తెచ్చుకుంది. ఇక తెలుగులో కూడా నయనతారకు ఫేమ్, మార్కెట్ ఉన్నాయి. తెలుగులో నయనతార నటించిన లక్ష్మి, సింహ, అదుర్స్ వంటి చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో నయనతార జతకట్టింది.

 

Also Read: ఇద్దరు కొడుకులతో కుమ్మేసింది, ఇప్పుడు తండ్రిపై కన్నేసింది… ఆయనతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి సిద్ధమైన పూజా హెగ్డే

 

ఇక ఎఫైర్ వార్తలతో నయనతార తరచుగా వార్తల్లో ఉంటారు. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఆమె హీరో శింబును ప్రేమించింది. వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. శింబుకి బ్రేకప్ చెప్పిన నయనతార పెళ్ళై పిల్లలు ఉన్న ప్రభుదేవకు దగ్గరైంది. నయనతారను వివాహం చేసుకోవడం కోసం ప్రభుదేవ భార్యకు విడాకులు ఇచ్చాడు. ప్రభుదేవ భార్య నయనతార మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుదేవను పెళ్లి చేసుకుంటుంది అనుకున్న తరుణంలో ఆయనతో కూడా విడిపోయింది.

ఫైనల్ గా దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. సరోగసీ పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చిన నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె సరోగసీ చట్టాన్ని ఉల్లంఘించారని భావించిన తమిళనాడు ప్రభుత్వం విచారణ జరిపింది. ఆధారాలు చూపి ఈ కేసు నుండి నయనతార దంపతులు బయటపడ్డారు. ధనుష్ తో ఇటీవల ఒక వివాదం నడిచింది. ఇక లేటెస్ట్ మేటర్ ఏంటంటే?… తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవొద్దు అని లేఖ విడుదల చేసింది.

Also Read:   ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ సీజన్ 2 ప్రారంభం తేదీ వచ్చేసింది..ఈ షో నుండి ఇద్దరు ‘బిగ్ బాస్ 9’ ఎంపిక!

 

లేడీ సూపర్ స్టార్ అనే పిలుపు నన్ను మీకు దూరం చేస్తుంది. నయనతారగా గుర్తించడం, పిలవడమే నాకు ఎంతో ఇష్టం. నా జీవితం తెరిచిన పుస్తకం. కష్టసమయాల్లో మీరు నాకెంతో తోడుగా ఉన్నారు. మీ అపరిమితమైన ప్రేమ మరవలేనిది. ప్రేమతో మీరిచ్చే బిరుదులు విలువైనవి. కానీ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ మాత్రం వద్దు. అలా పిలిపోయించుకోవడం నాకు ఇష్టం లేదని, ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.

నయనతార చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో టాక్సిక్ ఒకటి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరో అక్క పాత్ర చేయడం విశేషం. కీలకమైన పాత్ర కావడంతో ఒప్పుకున్నారట.

RELATED ARTICLES

Most Popular