Mahesh babu , Rajamouli , Prithviraj Sukumaran
Mahesh babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి కేవలం అభిమానులు మాత్రమే కాదు, మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన టాలీవుడ్ స్థాయి ని జాతీయ స్థాయి నుండి #RRR తో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, మహేష్ సినిమాతో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని టార్గెట్ చేసాడు. అందుకే ఈ చిత్రానికి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ ని నిర్మాతలతో ఖర్చు చేయిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఒడిశా ప్రాంతంలో మొదలై ఒక షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. సుమారుగా రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా(Priyanka Chopra), పృథ్వీ రాజ్(Prudhviraj Sukumaran) వంటి వారు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా రెండవ షెడ్యూల్ కి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : 1000 కోట్లు కాదు..2000 కోట్లు..షూటింగ్ ప్రారంభం కాకముందే మహేష్ ,రాజమౌళి మూవీకి సంచలన రికార్డు!
మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ మొదలు కాబోతుందని, ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు ఇతర తారాగణం పాల్గొంటారని అంటున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ఇక నుండి బ్రేకులు లేకుండా జరుగుతాయని, సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎంత వేగంగా షూటింగ్ ని పూర్తి చేసినా కనీసం రెండేళ్ల సమయం పడుతుందని టాక్. ముందుగా ఇండియా లో కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, ఆ తర్వాత అత్యధిక శాతం మూవీ షూటింగ్ అమెజాన్ అడవుల్లో తెరకెక్కిస్తారని తెలుస్తుంది. రాజమౌళి కెరీర్ లోనే అత్యంత కఠినమైన జానర్ సినిమా అట ఇది.
కీరవాణి కూడా ఒక మ్యూజిక్ ఈవెంట్ లో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, నేను నా కెరీర్ లో ఎన్నో జానర్స్ కి సంగీతం అందించాను కానీ, ఇలాంటి జానర్ సినిమాకు ఎప్పుడూ అందించలేదు. నా వరకు ఇది చాలా కఠినమైన సినిమా, నాకు పెద్ద సవాల్ లాంటిది. కానీ తప్పదు, చేయాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. కీరవాణి చెప్పిన మాటలను బట్టి చూస్తే, మన ఇండియా లో ఇప్పటి వరకు ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. అన్ని సినిమాల లాగా కాకుండా, ఈ సినిమాని అడవుల్లో, అలాగే ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. నెలల తరబడి అడవుల్లో షూటింగ్ అంటే ఎంత కష్టతరమైనదో ఊహించుకోవచ్చు. అందుకే ఈ చిత్రం రాజమౌళి కెరీర్ లోనే అత్యంత కఠినమైన సినిమా అని అందరూ అంటున్నారు. ఇక పోతే ఈ చిత్రం లో హీరోయిన్స్ లో మరో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు నటించబోతున్నారని టాక్.
Also Read : వందల సంవత్సరాలు వెనక్కి..మహేష్ – రాజమౌళి మూవీ పూర్తి స్టోరీ వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి!