https://oktelugu.com/

Ghibli Art : గిబ్లి ఆర్ట్ సురక్షితమేనా?

Ghibli Art : సోషల్ మీడియాలో ప్రస్తుతం గిబ్లి ఆర్ట్స్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఉన్న ఫోటోలను ఒక కార్టూన్ లాగా మార్చి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సందడి చేస్తున్నారు.

Written By: , Updated On : April 2, 2025 / 05:12 PM IST
Ghibli Art

Ghibli Art

Follow us on

Ghibli Art : సోషల్ మీడియాలో ప్రస్తుతం గిబ్లి ఆర్ట్స్ గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఉన్న ఫోటోలను ఒక కార్టూన్ లాగా మార్చి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సందడి చేస్తున్నారు. సినీ తారల నుంచి రాజకీయ నాయకుల వరకు తమ ఫోటోలను గిబ్లి ఆర్ట్ గా మార్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీనిని చాలామంది ఫాలో అవుతూ తమ డీపీలను కూడా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు గిబ్లి అంటే ఏంటి? ఇది ఎక్కడ ప్రారంభమైంది? అనే సందేహం చాలామందికి వచ్చింది.

1985లో జపాన్ కు చెందిన దర్శకుడు హయావో మియాజాకి Ghibli స్టూడియోలో ప్రారంభించారు. అంటే చేతితో కొన్ని యానిమేటెడ్ కార్టూన్లను గీసి స్టోరీలకు అనుగుణంగా అందించారు. అలా అవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి. ఆయన ఈ ఆర్టులతో మై నేబర్ టోటోరో వంటి సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత గిఫ్లి ఆర్ట్ వెలుగులోకి వచ్చింది. ఏయ్ కి చెందిన ఒక యాప్ లో సాధారణ ఫోటోలు ఉంచితే వాటిని గిబ్లిలాగా తయారు అవుతున్నాయి. ఇవి చూడ్డానికి డిఫరెంట్ గా ఉండడంతో చాలామంది దీనిని క్రియేట్ చేసుకుంటున్నారు.

Also Read : వివాదంలో చాట్‌ జీపీటీ.. అడ్డంగా దొరికిపోయిన సీఈవో!

ఒక సాధారణ ఫోటోను ఇడ్లీ లాగా మార్చాలంటే ముందుగా chatgpt.com అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. ఆ తర్వాత అందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో మోడల్ సెలక్షన్ ట్యాబ్ నుంచి జిపిటి 40 లోకి మారాల్సి ఉంటుంది. ఇప్పుడు చాట్ చేయడం ద్వారా అనుకున్న పిక్చర్ను పొందవచ్చు. లేదా మీ పర్సనల్ ఫోటోలను అప్లోడ్ చేసి దానిని గిబ్లిగా మార్చాలంటే మారుతుంది. ఇలా కావాల్సిన అన్ని ఫోటోలు తీసుకోవచ్చు.

అయితే ఇడ్లీతో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని సాంకేతిక ని పనులు తెలుపుతున్నారు. ఇందులో ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా ఇవి ప్రైవసీని దెబ్బతీసే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా పర్సనల్ ఫోటోలను అప్లోడ్ చేయడం ద్వారా ఇవి సురక్షితమైన అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫ్యామిలీ ఫోటోలు సైతం అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొందరు తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సరదా కోసం ఇతర ఫోటోలను గిబ్లిగా మార్చుకుంటే పర్వాలేదు.. కానీ పర్సనల్ లేదా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఇలా మార్చుకోవడం ద్వారా నష్టాలే ఉంటాయని అంటున్నారు.

కానీ చాలామంది ఇవేమీ పట్టించుకోకుండా ఇప్పటికే పర్సనల్ తో పాటు ఫ్యామిలీ ఫోటోలను గిబ్లిగా మార్చుకున్నారు. సినీ తారలతోపాటు కొందరు రాజకీయ నాయకులు సైతం తమ ఫోటోలను ఇలా మార్చుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. సాధారణ వ్యక్తులు గిబ్లిగా మారిన తర్వాత ఎలా ఉంటామో చూసుకోవాలని కొందరు ఆసక్తి చూపుతూ ఇలా మార్చుతున్నారు. దీంతో ఈ యాప్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

Also Read : అది ఇక కనిపించదు.. చాట్ జిపిటి సృష్టికర్తల సంచలన నిర్ణయం