https://oktelugu.com/

Mahesh And Rajamouli: 1000 కోట్లు కాదు..2000 కోట్లు..షూటింగ్ ప్రారంభం కాకముందే మహేష్ ,రాజమౌళి మూవీకి సంచలన రికార్డు!

ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కోసం చాలా టెస్టులు చేసారు. చివరికి ప్రస్తుతం మనం చూస్తున్న మహేష్ బాబు లుక్ ఈ సినిమా కోసం సిద్ధం చేసిందే. పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం తో మహేష్ బాబు వేరే లెవెల్ లో ఉన్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 11:34 AM IST

    Rajamouli And Mahesh

    Follow us on

    Mahesh And Rajamouli: తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి, త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీయబోయే సినిమాతో మన ఇండస్ట్రీ ని హాలీవుడ్ ని మించిపోయే రేంజ్ కి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. #RRR చిత్రంతో ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టి హాలీవుడ్ దిగ్గజ దర్శకుల ప్రశంసలను అందుకున్న రాజమౌళి, ఈసారి వసూళ్ల పరంగా కూడా హాలీవుడ్ తో పోటీ పడనున్నాడు. గత ఏడాది నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసేందుకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు. స్క్రిప్ట్ సిద్ధం అయ్యాక వర్క్ షాప్ ని ఏర్పాటు చేసి నటీనటులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కోసం చాలా టెస్టులు చేసారు. చివరికి ప్రస్తుతం మనం చూస్తున్న మహేష్ బాబు లుక్ ఈ సినిమా కోసం సిద్ధం చేసిందే. పొడవాటి జుట్టు, గుబురు గెడ్డం తో మహేష్ బాబు వేరే లెవెల్ లో ఉన్నాడు.

    అంతే కాకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా కోయ భాష నేర్చుకున్నాడు. అందుకు ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ సహకారం అందించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి బడ్జెట్ సుమారుగా 1000 కోట్ల రూపాయిలు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాలం దృష్ట్యా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలు అవ్వుద్దో కూడా తెలియదు, ఇప్పటి నుండే ఈ సినిమాకి బిజినెస్ మొదలైపోయిందట. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి కేవలం థియేట్రికల్ బిజినెస్ 2000 కోట్ల రూపాయిలకు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఇలా నాన్ థియేట్రికల్ మొత్తం కలిపి మరో వెయ్యి కోట్ల రూపాయిలు అవుతుందని తెలుస్తుంది.

    నిర్మాత ఒప్పుకుంటే ఇప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభించడానికి బయ్యర్స్ సిద్ధంగా ఉన్నారు. కానీ నిర్మాతలకు ఆసక్తి లేదు. ఎందుకంటే సినిమా షూటింగ్ మొదలై ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినప్పుడల్లా బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఉంది కదా అని ఇప్పుడే ప్రారంభిస్తే నిర్మాతకి నష్టం. అందుకే ఇప్పట్లో ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలుపెట్టే ఉద్దేశ్యం నిర్మాత కె ఎస్ రామారావు కి లేదట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి రోజుకో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియా లో లీక్ అవుతుంది. ఇప్పటికే మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ ఇందులో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్ర పోషించబోతున్నాడట, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్.