Mahesh And Rajamouli: వందల సంవత్సరాలు వెనక్కి..మహేష్ – రాజమౌళి మూవీ పూర్తి స్టోరీ వింటే మీ రోమాలు నిక్కపొడుచుకుంటాయి!

రాజమౌళి కూడా ఈ చిత్రానికి 1500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అది 200 ఏళ్ళ కాలం నాటి కథ అట. ఈ సినిమాలో దాదాపుగా 200 ప్రముఖ ఆర్టిస్టులు నటించబోతున్నారట.

Written By: Vicky, Updated On : September 13, 2024 5:29 pm

Rajamouli And Mahesh

Follow us on

Mahesh And Rajamouli: కొన్ని చిత్రాల కోసం అభిమానులు ఎంతలా అయితే ఎదురు చూస్తారో, ప్రేక్షకులు, అలాగే ట్రేడ్ వర్గాలు కూడా అంతే ఆత్రుతతో ఎదురు చూస్తాయి. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – రాజమౌళి సినిమా. ఎప్పుడో మన చిన్నతనం లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఖరారు అయ్యింది. కానీ రాజమౌళి, మహేష్ బాబు తమకు ఉన్న కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకొని, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే ఇన్ని సంవత్సరాల సమయం పట్టినప్పటికీ, మహేష్ అభిమానులకు కావాల్సిన అంశాలు మొత్తం ఈ చిత్రంలో ఉంచేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ పదేళ్ల క్రితం వచ్చి ఉండుంటే కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునే స్థాయికి ఎదిగినప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సరైన స్కేల్ లో తీసి ప్రమోట్ చేస్తే వసూళ్ల విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడగల సత్తా ఉన్న సినిమాగా మారుతుంది ఈ కాంబినేషన్.

అందుకు తగ్గట్టుగానే రాజమౌళి కూడా ఈ చిత్రానికి 1500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అది 200 ఏళ్ళ కాలం నాటి కథ అట. ఈ సినిమాలో దాదాపుగా 200 ప్రముఖ ఆర్టిస్టులు నటించబోతున్నారట. అప్పటి కాలం లో ఉండే వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడట. అప్పటి కోయభాషకు సంబంధించిన వారి లుక్స్ ఎలా ఉండేవో, అలాంటి లుక్స్ ని వెండితెర పై తీసుకొచ్చేందుకు రాజమౌళి అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయట. మహేష్ బాబు ఈ చిత్రంలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఆయన లుక్స్ కి సంబంధించిన టెస్ట్ కూడా పూర్తి అయ్యింది. ఈ చిత్రంలో ఆయన వాడే భాష కూడా కొత్తగా ఉండనుంది.

ఆ భాష నేర్చుకునేందుకు మహేష్ ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట. మొత్తం మీద మహేష్ ఆ పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోడానికి మరో మూడు నెలల సమయం పడుతుందట. జనవరి నెలలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. డిసెంబర్ నెలలో రాజమౌళి మహేష్ తో కలిసి ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయనున్నారట. ఈ ప్రెస్ మీట్ లో తమ సినిమా స్టోరీ లైన్ మొత్తం చెప్పేస్తాడట రాజమౌళి. తన ప్రతీ సినిమాకి ఇలా చెప్పడం రాజమౌళి కి అలవాటు. ఆ అలవాటుని ఈ సినిమా ద్వారా కూడా కొనసాగించబోతున్నాడు. చూడాలి మరి భవిష్యత్తులో ఈ సినిమా గురించి ఇంకెన్ని ఆసక్తికరమైన వినాల్సి వస్తుంది అనేది.