Mahesh Babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియా లో వచ్చినా, అది వైల్డ్ ఫైర్ లాగా మారిపోతుంది. నిన్న మహేష్ బాబు మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ కలిసి ఒక వీడియో లో కనిపించారు. ఆ వీడియో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. వేలకొద్ది ట్వీట్స్ ఆ వీడియో మీద పడ్డాయి. అంతే కాకుండా రాజమౌళి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాగేసుకుంటూ, కామెడీ గా పెట్టిన ఒక వీడియో కి రికార్డు స్థాయిలో లైక్స్ , వ్యూస్, కామెంట్స్ వచ్చాయి. ఇలా గతంలో ఏ రాజమౌళి సినిమా అప్డేట్ కి జరగలేదట. దీనిని బట్టి ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం అడవిలో భారీ ఫైట్ ను సిద్ధం చేసిన రాజమౌళి…
అదేమిటంటే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ని ఒడిశాలో ప్లాన్ చేసాడట రాజమౌళి. సాధారణంగా రాజమౌళి ఎక్కువగా అవుట్ డోర్ షూటింగ్స్ ని చేయడానికి ఇష్టపడడు. అన్నపూర్ణ స్టూడియోస్ లేదా రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్స్ ని ఏర్పాటు చేసి, ఒక సరికొత్త లోకాన్ని సృష్టించి, అందులోనే నెలల తరబడి షూటింగ్స్ చేస్తూ ఉంటాడు. మరీ అత్యవసరం అనుకుంటే తప్ప, ఆయన అవుట్ డోర్ షూటింగ్స్ చేయడానికి ఇష్టపడడు. మగధీర, బాహుబలి, #RRR చిత్రాలకు అదే చేసాడు. కానీ మహేష్ సినిమా కి మాత్రం ఆయన నిజమైన ప్రదేశాల్లో షూటింగ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా రాజమౌళి రెండు నెలల క్రితం అమెజాన్ ఫారెస్ట్ లో ట్రిప్ వేసి లొకేషన్స్ వేట చేసిన సంగతి తెలిసిందే.
మహేష్ బాబు కూడా కొంతకాలం వరకు అమెజాన్ ఫారెస్ట్ లో సంచరించాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగే చిత్రమిది. అయితే లేటెస్ట్ షెడ్యూల్ ని ఓడిశాలోని కొరాపుట్ జిల్లా లోని దేవమాలి, తలమాలి, కల్యమాలి వంటి ప్రదేశాల్లో షూటింగ్ ని ప్లాన్ చేస్తున్నారట. మూవీ థీమ్ ఆ ప్రాంతాల్లోని ప్రకృతి అందాలతో పాటు, అక్కడి జనాల జీవనశైలికి తగ్గట్టుగా ఉంటుంది కాబట్టి రాజమౌళి ఆ ప్రాంతాల్లో ఈ సినిమాని మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కోరాపుట్ జిల్లాలో ఉండే అడవులు, పర్వతాలు చూసేందుకు చాలా అందంగా ఉంటాయట. ఈ లొకేషన్స్ లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఎలా మేక్ ఓవర్ అయ్యాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా ఆయన హెయిర్ స్టైల్ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : మహేష్ కి విలన్ గా స్టార్ హీరో, అలా హింట్ ఇచ్చేశాడా? రాజమౌళి ఛాయిస్ అదుర్స్!