OG
OG : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ఏదైనా ఉందా అంటే అభిమానులకు టక్కుమని గుర్తుకు వచ్చే పేరు జానీ. పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాపై ఆరోజుల్లో బాహుబలి సినిమాకు ఉన్నంత అంచనాలు ఉండేవట. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన కెరీర్ లో అలాంటి అంచనాల నడుమ విడుదలైన సినిమాలు జల్సా, పులి, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి వంటివి ఉన్నాయి. ఇప్పుడు ‘ఓజీ'(They Call Him OG) చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ సినిమాని కూడా ఈ సినిమాల జాబితాలో చేర్చొచ్చని అంటున్నారు విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మీద అంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం గ్లిమ్స్ వీడియో.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ కి మోక్షం దక్కేది అప్పుడేనా..?
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 2023 వ సంవత్సరం సెప్టెంబర్ 2 న ఈ గ్లిమ్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ జనరేషన్ ఆడియన్స్ ఈ గ్లిమ్స్ వీడియో ని చూడగానే మెంటలెక్కిపోయారు. పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ సినిమా అంటే ఇది కదా, ఆయన్ని ఇలా చూడాలనే కూడా ఇన్ని రోజులు మేము కోరుకున్నది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మురిసిపోయారు. ఓజీ అనే పేరు వింటేనే వాళ్ళ శరీరంలో వెయ్యివోల్టుల ఎనర్జీ పుడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి సినిమా నుండి గత ఏడాది నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్లే. అయితే వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కారణం పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో డేట్స్ ఇస్తాడు కాబట్టి.
డేట్స్ ఇచ్చిన వెంటనే అభిమానులు ఉర్రూతలు ఊగిపోయే రేంజ్ టీజర్ ని విడుదల చేసి, సినిమా విడుదల తేదీని కూడా ఆ టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ, కొన్ని అనుకోని సంఘటనలు ఎదురు అవ్వడం వల్ల కుదర్లేదు. బయ్యర్స్ కి మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం చూస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో, లేదా అక్టోబర్ లో ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో టీజర్ ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా ఖరారు చేస్తారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) మూవీ చిత్రం మే9న విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. ఏప్రిల్ 21 లోపు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు మేకర్స్.
Also Read : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సీక్వెల్ కి రచయితగా మారిన యంగ్ హీరో..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!