Yazuvendra Chahal-Dhanashree Divorce
Yazuvendra Chahal-Dhanashree : హార్దిక్ పాండ్యా – నటాషా(Hardik Pandya Natasha) విడివిడిగా ఉన్నప్పుడు కూడా విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. దానిని అవును అని కాని, కాదు అని కాని వారిద్దరు చెప్పలేదు. మొత్తంగా చూస్తే ఇద్దరు విడిపోతున్నారని.. అందువల్లే విడిగా ఉంటున్నారనే విషయాన్ని మాత్రం సోషల్ మీడియా పసిగట్టింది. ప్రధాన మీడియా ప్రచారం చేసింది. మొత్తంగా చూస్తే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా నటాషాతో విడాకుల ప్రకటనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పుడు యజువేంద్ర చాహల్ – ధనశ్రీ వ్యవహారంలోనూ అదే జరుగుతోంది.. ఇటీవల కాలంలో వీరిద్దరూ సామాజిక మాధ్యమాలలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇప్పుడు వేరువేరుగా ఉంటున్నారు. వేరు పడేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు.
Also Read : చాహల్ – ధనశ్రీ ఇంకా విడాకులు తీసుకోలేదట.. ఇచ్చే భరణం 60 కోట్లు కాదట!
ఫ్యామిలీ కోర్టు తీర్పు
ధనశ్రీ – చాహల్ విడాకుల పిటిషన్ ను గతంలోనే ముంబై ఫ్యామిలీ కోర్టులో వేశారు. అయితే వారి పిటిషన్ విచారణ దశలో ఉన్నప్పటికీ విడాకులు జరిగిపోయాయని.. భరణంగా చాహల్ 60 కోట్ల దాకా ఇచ్చాడని ప్రచారం జరిగింది. అయితే విడాకులు అధికారికంగా వెల్లడి కావడం వల్లే చాహల్ ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు దుబాయ్ వెళ్లాడని.. అతని వెంట మహ్వేష్ ఉందని ప్రచారం జరిగింది. చాహల్ వెంట మహ్వేష్ ఉండడం పై ప్రచారానికి బలం చేకూరింది. అయితే బుధవారం బాలీవుడ్, స్పోర్ట్స్ వర్గాల్లో జరిగిన ప్రచారం ప్రకారం చాహల్ – ధనశ్రీకి విడాకులు అధికారికంగా మంజూరు కాలేదని తెలిసింది. అంతేకాదు భరణం విషయంలోనూ రకరకాల పుకార్లు వచ్చాయని తేలింది. ఇక గురువారం ముంబై ఫ్యామిలీ కోర్టు చాహల్ – ధనశ్రీకి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీకి చాహల్ 4.75 కోట్లు భరణంగా చెల్లించడానికి అంగీకరించాడు. ఇక ఇందులో కొంత మొత్తాన్ని చాహల్ ఇప్పటికే ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ తీర్పుకోసమే చాహల్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. అందువల్లే అతడు ఐపీఎల్లో ఏ జట్టులో చేరలేదు. ఇక ఇప్పుడు అతడికి అధికారికంగా విడాకులు మంజూరు కావడంతో ఐపీఎల్ లో ఆడేందుకు మార్గం సుగమం అయింది. గత సీజన్లో చాహల్ రాజస్థాన్ జట్టు తరఫున ఆడాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు హైయెస్ట్ వికెట్ టేకర్ గా చాహల్ కొనసాగుతున్నాడు. విడాకుల తర్వాత చాహల్ – ధనశ్రీ ఎవరికి వారుగా వెళ్లిపోయారు. వారు కోర్టులోకి వచ్చినప్పుడు ముఖాలకు మాస్క్, కళ్ళకు అద్దాలు ధరించి వచ్చారు. వారి ముఖాలను పదేపదే ప్రసారం చేయడానికి మీడియా ప్రతినిధులు వెంట పడగా.. వారు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : దుబాయిలో మరో అమ్మాయితో చాహల్ కనిపించిన వేళ.. ధనశ్రీ వర్మ సంచలన పోస్ట్..