https://oktelugu.com/

Mahesh Babu and Rajamouli : రేపే మహేష్ బాబు,రాజమౌళి మూవీ గ్రాండ్ లాంచ్..ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్న పాన్ ఇండియన్ హీరోలు!

కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ రేపు హైదరాబాద్ లో ఉదయం పది గంటలకు పూజా కార్యక్రమం ద్వారా గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 01:29 PM IST

    Mahesh Babu, Rajamouli

    Follow us on

    Mahesh Babu and Rajamouli : కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి మూవీ రేపు హైదరాబాద్ లో ఉదయం పది గంటలకు పూజా కార్యక్రమం ద్వారా గ్రాండ్ గా లాంచ్ కాబోతుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. తన ప్రతీ సినిమా లాంచ్ ఈవెంట్ కి డుమ్మా కొట్టే మహేష్ బాబు, తన కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా లాంచ్ కి అయినా హాజరు అవుతాడా లేదా అనేది ఇప్పుడు అభిమానుల్లో మొదలైన పెద్ద ప్రశ్న. తన సినిమా ప్రారంభోత్సవానికి హాజరైతే, ఆ చిత్రం కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ మహేష్ బాబు లో ఉందట. అందుకే ఆయన లాంచింగ్ ఈవెంట్స్ కి డుమ్మా కొడుతుంటాడని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తుంటాయి. కానీ రేపు జరగబోయే లాంచ్ ఈవెంట్ కి మహేష్ బాబు కచ్చితంగా హాజరు కాబోతున్నాడని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

    రాజమౌళి తన ప్రతీ మూవీ లాంచ్ కి, తనతో కలిసి పని చేసిన హీరోలను పిలుస్తూ ఉంటాడు. #RRR మూవీ లాంచ్ కి ప్రభాస్, రానా వంటి వాళ్ళు హాజరైన సంగతి మన అందరికీ తెలిసిందే. రేపు జరగబోయే లాంచ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్టు టాక్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, విలన్ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది. మిగిలిన తారాగణం కి సంబంధించిన వివరాలు రేపు రాజమౌళి ప్రెస్ మీట్ ద్వారా తెలియచేసే అవకాశాలు ఉన్నాయి. తన ప్రతీ సినిమా ప్రారంభం రోజున, తన సినిమా స్టోరీ గురించి, థీమ్ గురించి, నటించబోయే నటీనటుల గురించి రాజమౌళి వివరాలు ఇవ్వడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

    ఈ సినిమా విషయం లో కూడా అదే చేయబోతున్నాడు. అయితే ఆయన ఈ వివరాలు మొత్తం రేపు ఇస్తాడా?, లేదా ఎల్లుండి ఇస్తాడా అనేది చూడాలి. ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో తెరకెక్కుతుంది అనే చిన్న సమాచారం మాత్రమే అభిమానులకు, ప్రేక్షకులకు ఇప్పటి వరకు తెలుసు. షూటింగ్ కోసం రాజమౌళి అమెజాన్ అడవుల్లో కొన్ని లొకేషన్స్ ని ఎంచుకున్నాడు. గత ఆరు నెలల నుండి ఆయన షూటింగ్ లొకేషన్స్ ని వెతికే పనిలోనే ఉన్నాడు. ఒక పక్కా ప్రణాళిక తో షూటింగ్ ని ప్రారంభించి ఏడాది లోపే సినిమాని పూర్తి చేయాలనీ, రాజమౌళి కెరీర్ లోనే ఫాస్ట్ గా పూర్తి అయ్యే చిత్రం గా ఇది నిలిచిపోవాలని, ఒక ఛాలెంజ్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నారట. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.