Rajamouli and Mahesh babu : ఒక సినిమా కోసం దర్శకుడు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రాయాసాలకు ఓర్చుకొని చాలా చోట్ల కాంప్రమైజ్ అవుతూ మొత్తానికైతే ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేసి భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటాడు…ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం తన సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ గా ఉంటాడు…అందుకే ఆయనకి ఇండియాలో చాలా మంచి క్రేజ్ అయితే ఉంటుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamoul)…ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతునట్టుగా తెలుస్తోంది. కానీ ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకొని తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో సీన్ ను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఎందుకంటే పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఈ సినిమా ఎంగేజ్ చేయగలగాలి.
Also Read : మహేష్ మూవీపై రాజమౌళి పెద్ద ప్లానింగే
అలా చేసినప్పుడు మాత్రమే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రావడమే కాకుండా సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తోంది. ఇక దానికోసమే ఆయన అహర్నిశలు ప్రయత్నం చేసి మరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు…ఇక ఆయన అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాలో ఒక్క సీన్ కోసం 100 కోట్లు పెట్టి మరి ఆ సిన్ ను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఐదు నిమిషాల పాటు ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ ఫైట్ కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ అయితే ఉందట ఇక దానికోసమే మొత్తం 100 కోట్ల ఖర్చు అయితే అవుతుందట.
ఇక ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని కూడా వేసినట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి గొప్ప గుర్తింపును కూడా సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను ఏ రేంజ్ లో ఈ సినిమాను తీస్తాడు. తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటుంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఎలాంటి గుర్తింపు లభిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read : రాజమౌళి మహేష్ బాబు కాంబో వస్తున్న సినిమాలో నటించనున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్…