Gopichand Malineni : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే బాలీవుడ్ ఇండస్ట్రీ కి షాక్ ఇస్తూ మన వాళ్ళు సాధించిన విజయాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయాయి… ఇప్పుడిప్పుడే నార్త్ లో మన హీరోల హవా ఎక్కువగా కొనసాగుతోంది…ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సక్సెస్ బాట పట్టకపోవడం తో అక్కడ మనవాళ్ళకి తిరుగులేకుండా పోతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని… ఇప్పుడు బాలీవుడ్ లో ఆయన చేసిన జాట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో గోపీచంద్ మలినేని చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. దాంతో ఇక గోపీచంద్ మలినేని కి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఆయనకు సల్మాన్ ఖాన్ (Salman Khan)తో భారీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా షారుక్ ఖాన్ కూడా గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట. మరి మొత్తానికైతే గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సెటిలైపోయే అవకాశాలు అయితే ఉన్నాయంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే జాట్ సినిమా పెను ప్రభంజనాన్ని సృష్టిస్తూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే దిశగా ముందుకు సాగుతోంది.
Also Read : ఆ స్టార్ హీరో స్టోరీ తోనే సన్నీ డియోల్ తో సినిమా చేస్తున్న గోపిచంద్ మలినేని…
మరి ఇలాంటి సందర్భంలో గోపీచంద్ మలినేని తన తర్వాత సినిమాను బాలీవుడ్ హీరోలతో చేయబోతున్నాడా? లేదంటే తెలుగు హీరోలతో చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం తెలుగు దర్శకులంతా బాలీవుడ్ బాట పడుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే మన దశకులందరూ బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఇదే సమయంలో బాలీవుడ్ హీరోలకు కూడా సరైన సక్సెసులైతే దక్కడం లేదు కాబట్టి వాళ్లు కూడా మన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దాంతోపాటుగా వాళ్లు కూడా మన దర్శకులతో సినిమాల చేసి అద్భుతాలను సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి ఇకమీదట బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలే దర్శకులు కూడా మన దర్శకులే కాబోతున్నారా?
ఇక ఇండియన్ సినిమా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ అండర్ లోకి రాబోతుందా? మన హీరోలు దర్శకుల హవా ఎక్కువగా కొనసాగిపోతుందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మీదట మన హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేదాని మీద మన ఇండస్ట్రీ ఏ స్థాయి కి వెళ్ళబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read : చిరంజీవి వద్దకు బాలయ్య డైరెక్టర్… ప్రాజెక్ట్ లాకైనట్లేనా!