Pokiri Movie Controversy: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)… ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది స్టార్ట్ డైరెక్టర్లలో తను కూడా ఒకరు కావడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. అతి పూరీ జగన్నాథ్ ఎంటైర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా పోకిరి(Pokiri) సినిమాకి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ఇక ఈ సినిమా పలు భాషల్లో కూడా రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించారు… ఇక ఈ ఒక్క సినిమాతో మహేష్ బాబు మాస్ హీరోగా మారడమే కాకుండా మహేష్ బాబు ను స్టార్ హీరోని కూడా చేసింది. మరి ఇలాంటి సందర్భంలో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి ఈ సినిమాతో మహేష్ చాలా గొప్ప క్రేజ్ నైతే సంపాదించుకున్నాడు… అయితే ఈ సినిమా లో ప్రకాష్ రాజ్ నగర్ ను చంపే సీన్ ను ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేసాము అంటూ ఈ సినిమాకి రచన సహకారం అందించిన తోట ప్రసాద్(Thota Prasad) గారు తెలియజేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రూ రొమాన్స్ (True Romance) అనే సినిమా నుంచి ప్రకాష్ రాజ్ నాజర్ ని చంపే సన్నివేశాన్ని తీసుకున్నామని యాస్ ఇట్ ఇస్ గా అందులో ఎలాగైతే విలన్ చంపుతాడో అలాగే ఇందులో కూడా నాజర్ ని ప్రకాశ్ రాజ్ టార్చర్ పెట్టి చంపేస్తాడు.
Also Read: ‘జూనియర్’ కి శ్రీలీల అందుకున్న రెమ్యూనరేషన్ తో ఒక సినిమానే తియ్యొచ్చు తెలుసా!
ఆ సీన్ బాగా ఎలివేట్ అయింది. బేసిగ్గా మహేష్ బాబు కి బాగా నచ్చిన సినిమా కూడా ట్రూ రొమాన్స్ సినిమానే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాకు తగ్గట్టుగా దాన్ని బాగా కన్వర్ట్ చేసి బాగా ప్రజెంట్ చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా చిత్రీకరించారు.
అందువల్లే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయగలిగింది అంటు తోట ప్రసాద్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఏది ఏమైనా కూడా పోకిరి (Pokiri) సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇలా కాపీ సన్నివేశాలని తెలియడంతో మహేష్ బాబు అభిమానులు కొంతవరకు నిరాశ చెందుతున్నప్పటికి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే సాధించింది. కాబట్టి ఆ సినిమాలోని సీన్లను ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన లేదంటే కాపీ చేసిన పెద్దగా పోయేదేమీ లేదు.
Also Read: ఎన్టీఆర్ వార్ 2 vs రజినీకాంత్ కూలీ…వీటిలో విజయం ఎవరిది..?
మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా జగన్నాథ్ లాంటి దర్శకుడు అప్పట్లో ఈ సినిమాతో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ని హీరోగా పెట్టి ఒక కంటెంట్ బేస్డ్ సినిమాని చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…