https://oktelugu.com/

పోకిరి తరువాత మహేష్ మళ్ళీ ఇప్పుడే.. !

మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది పోకిరి సినిమానే. దానిలో మహేష్ మొదటిసారి కొత్తగా కనిపించాడు. అప్పటివరకు ఉన్న పొట్టి జట్టును వదిలేసి.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఆ సినిమాలో మహేష్ గెటపే. మళ్ళీ ఇన్నేళ్లు తరువాత మహేష్ తన లుక్ మారుస్తున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో పూర్తి కొత్త లుక్ […]

Written By:
  • admin
  • , Updated On : July 9, 2020 / 07:25 PM IST
    Follow us on


    మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది పోకిరి సినిమానే. దానిలో మహేష్ మొదటిసారి కొత్తగా కనిపించాడు. అప్పటివరకు ఉన్న పొట్టి జట్టును వదిలేసి.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఆ సినిమాలో మహేష్ గెటపే. మళ్ళీ ఇన్నేళ్లు తరువాత మహేష్ తన లుక్ మారుస్తున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో పూర్తి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రింగుల జుట్టుతో కాలేజీకి వెళ్లే స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్ కొత్త కొత్తగా కనిపించి ఫ్యాన్స్ కు కొత్తదనం అద్దబోతున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ తన ఎకౌంట్స్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తేనే అర్ధమవుతుంది మహేష్ కొత్త లుక్ ఎలా ఉండబోతోందనేది.

    కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

    పైగా ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి నుండే సినిమా పై ఆరా తీస్తున్నారు. సినిమా కథ ఏమిటి ? ఏ అంశం పై సినిమా ఉండబోతుంది ? టైటిల్ ను చూస్తే.. సినిమాలో రాజకీయ అంశాలు ఉంటాయోమోనని అనుమానం కలుగుతోంది. మరి ప్రధానంగా సినిమా ఎలా సాగబోతుంది ? ఇలా ఫ్యాన్స్ డైరెక్ట్ గా మహేష్ కే మెసేజ్ లు పెడుతున్నారు. అయితే సినిమా మాత్రం రాజకీయ నేపథ్యంతోనే సాగుతుందని.. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

    అలాగే భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్లు ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అన్నదే మెయిన్ పాయింట్ అని.. ఈ క్రమంలో మహేష్ చేసే ప్రయత్నాలు, మహేష్ వేసే ప్లాన్స్ ఇంట్రస్ట్ గా ఉంటాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కరోనా లేకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికే షూటింగ్ సగం పూర్తయిపోయేది.