https://oktelugu.com/

ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!

ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఏడాది పాలన ముగిశాక తన ప్రతీకారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన ప్రత్యర్థులైన టీడీపీ నేతలు ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కాళ్ల కిందకు నీళ్లు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నేతల తప్పులే వారికి శిక్ష పడేలా చేస్తుండడం కూడా జగన్ పనిని సులువు చేస్తోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుతో కలిసి తనను ముప్పుతిప్పలు పెట్టిన ఆ రెండు పత్రికలు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2020 6:10 pm
    Follow us on


    ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఏడాది పాలన ముగిశాక తన ప్రతీకారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన ప్రత్యర్థులైన టీడీపీ నేతలు ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కాళ్ల కిందకు నీళ్లు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నేతల తప్పులే వారికి శిక్ష పడేలా చేస్తుండడం కూడా జగన్ పనిని సులువు చేస్తోంది.

    వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుతో కలిసి తనను ముప్పుతిప్పలు పెట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఏపీ సీఎం జగన్ వదిలేలా కనిపించడం లేదు. కోడికత్తి నుంచి మొదలుపెడితే వైఎస్ వివేకా హత్యవరకు జగన్ ను ఆ రెండు పత్రికలు ఎంత అభాసుపాలు చేయాలో అంతా చేశాయి. ఎన్నోసార్లు జగన్ జైలు జీవితాన్ని దెప్పిపొడిచాయి. ఆయనపై దారుణంగా దుష్ప్రచారం చేశాయి. నాడు అధికారంలోని లేని జగన్ ఆ రెండు పత్రికలను కాచుకోలేదు.

    కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

    చంద్రబాబుతోపాటు ఆయనకు సపోర్టు చేసే ఆ రెండు పత్రికలకు జగన్ ప్రభుత్వం ఇటీవలే ఓసారి నోటీసులు పంపి వార్ మొదలుపెట్టాడు.. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ కోసం అవసరమయ్యే సంచులను జగన్ కంపెనీ నుంచి ఎలాంటి టెండర్ లేకుండా కొనుగోలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని ఆ రెండు పత్రికలు ప్రచురించడమే జగన్ ఆగ్రహానికి కారణమైందట.. అందులో జగన్ పవర్ ప్రాజెక్టు కూడా ఉండడంతో ఆయనపై వ్యతిరేకంగా కథనాలను ఆ పత్రికలు వండివర్చాయి. ప్రభుత్వ వివరణను చిన్నగా మూలకు తొక్కేశాయి. చంద్రబాబుతోపాటు ఆ రెండు పత్రికలకు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని..లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రభుత్వం తరుపున స్పష్టం చేశారు.

    ఇప్పటికే ఓసారి ఈనాడు, ఆంధ్రజ్యోతిలను టార్గెట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా మరోసారి నోటీసులు పంపి వాటి వెన్నులో వణుకు పుట్టించింది. 108 అంబులెన్స్ ల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేసినందుకు రెండు పత్రికలతోపాటు టీడీపీ నేతకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు పంపింది.

    కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

    టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వం తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా కథనాలు రాసినందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు ప్రభుత్వం హెచ్చరించింది. అంబులెన్స్ ల కొనుగోలులో పూర్తి పారదర్శకంగా టెండర్ల ద్వారానే కొనుగోలు చేశామని.. దీని వల్ల ప్రభుత్వానికి 399 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని నోటీసుల్లో పేర్కొంది. ప్రభుత్వంపై బురద జల్లినందుకు క్షమాపణ చెప్పాలని లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    ఇలా రెండోసారి జగన్ సర్కార్ ఆ రెండు పత్రికలపై నజర్ పెట్టింది. 108 అంబులెన్స్ లో కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు నోటీసులు పంపింది. చూస్తుంటే టీడీపీని, ఆ రెండు పత్రికలను జగన్ సర్కార్ అంత తేలికగా వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.