https://oktelugu.com/

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత..

‘బజరంగీ భాయిజాన్‌’, ‘లింగా’, ‘పవర్’ వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, కన్నడ నటుడు రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు కరోనా సోకిందా? ఆయన ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందా? అంటే కన్నడ వర్గాలు అవుననే అంటున్నాయి. అనారోగ్యం కారణంగా వెంకటేశ్‌లో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 9, 2020 / 07:33 PM IST
    Follow us on


    ‘బజరంగీ భాయిజాన్‌’, ‘లింగా’, ‘పవర్’ వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, కన్నడ నటుడు రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు కరోనా సోకిందా? ఆయన ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందా? అంటే కన్నడ వర్గాలు అవుననే అంటున్నాయి. అనారోగ్యం కారణంగా వెంకటేశ్‌లో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే, శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

    యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

    ఈ క్రమంలో దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతతో కలిసి ఈ మధ్యే కర్నాటక సీఎం సీఎం యాడ్యురప్పను కలిశారు. అయితే, తనకు కరోనా సోకిందని సుమలత రెండు రోజుల కింద స్వయంగా ప్రకటించారు. దాంతో సుమలతను కలిసినందు వల్ల రాక్‌లైన్‌కు కూడా కరోనా సోకిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయాన్ని డాక్టర్లు ఇప్పటిదాకా వెల్లడించలేదు. రాక్‌లైన్ ప్రస్తుతం కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ హీరోగా ‘రాజవీర మడకారి నాయక( అనే పిరియాడికల్‌ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతగా వెంకటేశ్‌కు మంచి పేరుంది. తెలుగులో సూపర్ హిట్‌ అయిన పలు చిత్రాలను శాండిల్‌వుడ్‌లో రీమేక్‌ చేసి సక్సెస్‌ అయ్యారు. పలు చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు. తెలుగులో చివరగా ‘ఆటగదరా శివ’ అనే మూవీని నిర్మించారు.