https://oktelugu.com/

Plastic slippers : ప్లాస్టిక్ చెప్పులు ఎక్కువగా వేసుకుంటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు!

ప్లాస్టిక్ చెప్పులు రోజూ ధరించడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. చెప్పులు ధరించేటప్పుడు ఇందులో ఉండే రసాయనాలు చర్మానికి తగిలి అలెర్జీ, దద్దర్లు వస్తాయి. ఈ ప్లాస్టిక్ చెప్పులకు ఫుట్ సపోర్ట్ ఉండదు. ఇవి కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, అలసటను కలిగిస్తాయి. తరచుగా ధరిస్తే స్కిన్ అలెర్జీలు రావడంతో పాటు పాదాలపై బొబ్బలు, పుండ్లు ఏర్పడతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 03:28 PM IST
    Follow us on

    Plastic slippers : రోజురోజుకి ఫ్యాషన్ కొత్త కొత్త రంగులు రూపుదిద్దుకుంటుంది. ఈక్రమంలో చాలామంది ట్రెండ్‌కి తగ్గట్టు చెప్పులు ధరిస్తున్నారు. అయితే ఈ మధ్య చాలామంది ప్లాస్టిక్ చెప్పులు ధరిస్తున్నారు. ఎక్కువ మోడల్స్ ఉండటంతో పాటు రేటు కూడా తక్కువగా ఉంటాయని వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్లాస్టిక్‌తో తయారుచేసిన షూలు, చెప్పులు వర్షాకాలంలో తడిచిన పాడవుకుండా ఉంటాయని వాడుతున్నారు. అయితే ఇవి ధరించడానికి సౌకర్యవంతంగా ఉన్నా ఆరోగ్యపరంగా సమస్యలు తప్పవని నిపుణలు చెబుతున్నారు. మరి వీటిని ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం.

    ప్లాస్టిక్ చెప్పులు రోజూ ధరించడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. చెప్పులు ధరించేటప్పుడు ఇందులో ఉండే రసాయనాలు చర్మానికి తగిలి అలెర్జీ, దద్దర్లు వస్తాయి. ఈ ప్లాస్టిక్ చెప్పులకు ఫుట్ సపోర్ట్ ఉండదు. ఇవి కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, అలసటను కలిగిస్తాయి. తరచుగా ధరిస్తే స్కిన్ అలెర్జీలు రావడంతో పాటు పాదాలపై బొబ్బలు, పుండ్లు ఏర్పడతాయి. ఈ చెప్పుల్లో తేమ, బ్యాక్టీరియా ఉండటం వల్ల పాదాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.

    ప్లాస్టిక్ బూట్లు కూడా ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటితో తయారు చేసిన బూట్లు ధరించడం వల్ల కొందరిలో కీళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. అలాగే మోకాలు, ఎముకల సమస్యలు కూడా వస్తాయట. ప్లాస్టిక్ బూట్లలలో పాదాల దగ్గర చెమట ఎక్కువగా పడుతుంది. గాలి లోపలికి చొరబడక బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇలాంటి చెప్పుల వల్ల వాతావరణంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దాదాపుగా అన్ని చెప్పుల్లో ఏదో రకమైన ప్లాస్టిక్ ఉంటుంది. కానీ కొందరు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ఉండేలా హానికరమైన ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. కల్తీ ప్లాస్టిక్‌తో తయారుచేసిన చెప్పులను ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.

    ప్లాస్టిక్ బూట్లు తయారీలో ఎక్కువగా పాలీఫ్లోరోఅల్కైల్ అనే రసాయనం ఉంటుంది. దీనివల్ల కొందరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శిలాజ ఇంధనాలతో తయారుచేసిన పాదరక్షలు వాడటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఇవి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి డబ్బులు కొంచెం ఎక్కువైన ఆరోగ్యానికి మేలు చేసే చెప్పులను ధరించడమే బెటర్.