Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సాధించిన విజయాలు ఆయన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. హాలీవుడ్ ఇండస్ట్రీలో జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి నిలబడలానే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన హాలీవుడ్ ఇండస్ట్రీలోకి మన సినిమాను తీసుకెళ్తున్నాడు. ఇక ఇది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన దర్శకుడు రాజమౌళి కావడం విశేషం… మొదటగా పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకున్న ఆయన ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి వెళ్లడం అనేది ఒక రకంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకి తీసుకోవడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన ఏఐ టెక్నాలజీని నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడు. దాని ద్వారా ఎక్కువగా టెక్నాలజీని వాడి హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్ చూపించాలనే కాన్సెప్ట్ తో తను ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు…
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడట. తను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి ఇప్పటివరకు ఏ రోజు, ఏ సినిమా కోసం ఇంతలా కష్టపడలేదని అతని సన్నిహితుల నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్ కోసం సుధీర్ బాబు కొడుకు అయిన ‘చరిత్ మానస్’ ను తీసుకోవడానికి రాజమౌళి సిద్ధమయ్యారట.
అంటే మహేష్ బాబు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అనే క్యారెక్టర్ కోసమే అతన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబు మేనల్లుడు కావడంతో చరిత్ మానస్ కూడా మహేష్ బాబు లాగానే ఉంటాడు. అందువల్లే సిమిలర్ లుక్ తో ఉంటారు కాబట్టే రాజమౌళి అతన్ని పిక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఘట్టమనేని అభిమానుల్లో విపరీతమైన ఆనందాలైతే వెలువడుతున్నాయి. నిజానికైతే రాజమౌళి ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
ఎందుకంటే ఈ న్యూస్ అఫిషియల్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రాజమౌళి ముందుగానే చరిత్ మానస్ ను తీసుకున్నాడట. ఎందుకంటే ఈ మధ్య ఆయనకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కూడా పెరిగింది. దాన్ని కూడా క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతోనే రాజమౌళి అతన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది…