https://oktelugu.com/

Trivikram Srinivas: ఆ స్టార్ హీరోపై త్రివిక్రమ్ మోజు..ఇంత తేడాగా మాట్లాడుతాడు అనుకోలేదు..త్రివిక్రమ్ కి అసలు ఏమైంది?

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహనిర్మాతగా వ్యవహరించాడు. ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ పై త్రివిక్రమ్ గతం లో 'సార్' చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 28, 2024 / 05:54 PM IST

    Trivikram Srinivas

    Follow us on

    Trivikram Srinivas: ‘సార్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో తీసిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఇటీవలే విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ మధ్యతరగతి కి చెందిన సామాన్యుడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అనిపించింది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు, విజయ్ దేవరకొండ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.

    సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహనిర్మాతగా వ్యవహరించాడు. ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ పై త్రివిక్రమ్ గతం లో ‘సార్’ చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆ కామెంట్స్ పై నెటిజెన్స్ ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు. ఆయన దుల్కర్ సల్మాన్ ని దగ్గరకి పిలిచి ‘నీ సినిమాలన్నీ నేను చూసాను. కొన్నిసార్లు నీతో ప్రేమలో కూడా పడ్డాను. ఒకే జెండర్ అయిన నేను ఇలా చెప్పకూడదు ఏమో కానీ నేను చెప్పేస్తున్నా’ అంటూ త్రివిక్రమ్ మాట్లాడుతాడు. ఇది చూసిన నెటిజెన్స్ ‘ఎదో తేడాగా ఉందే..త్రివిక్రమ్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇలా మాట్లాడుతున్నాడేంటి’ అంటూ చెప్పుకొచ్చారు. కొంతమంది అయితే ఈయనకి బుర్ర పూర్తిగా చెడిపోయింది. అందుకే ఈమధ్య ‘అజ్ఞాత వాసి’, ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలు ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది నిర్మాత నాగ వంశీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ అభిమానుల్లో అంచనాలను పెంచేసాడు. ‘జులాయి’, ‘అలా వైకుంఠపురంలో’ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ తర్వాత, వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రమిది. ప్రస్తుతం ‘పుష్ప 2’ బిజీ లో ఉన్న అల్లు అర్జున్, ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే ఆయన త్రివిక్రమ్ తో సినిమాని ప్రారంభిస్తాడు. ‘గుంటూరు కారం’ చిత్రంతో పూర్తిగా ఫామ్ కోల్పోయాడు అని త్రివిక్రమ్ మీద అభిమానుల్లో, ట్రేడ్ లో ఒక అభిప్రాయం ఏర్పడింది. మరి ఆ అభిప్రాయాన్ని త్రివిక్రమ్ ఈ సినిమాతో చెరిపివేసుకుంటాడా లేదా అనేది చూడాలి.