Mahesh Babu : సినీ హీరోలు ఇక నుండి ఏదైనా ప్రోడక్ట్ కి కానీ, లేదా ఏదైనా ఒక ప్రముఖ సంస్థ కి కానీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ముందు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా..?, ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. నిన్ననే అల్లు అర్జున్(Icon Star Allu Arjun), శ్రీలీల(Sreeleela) పై AISF సంస్థ కొన్ని తప్పుడు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా మారారని, వీళ్ళ ప్రొమోషన్స్ ని చూసి లక్షలాది మంది మోసపోయారని, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఘటన ఎంత వైరల్ గా మారిందో మనమంతా చూసాము. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనం గా మారింది. వివాదాలకు ఆమడ దూరం లో ఉండే మహేష్ బాబు(Superstar Mahesh Babu) కూడా వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. రెండు మూడు ప్రకటనలు కూడా చేసి పెట్టాడు. అయితే సాయి సూర్య డెవెలపర్స్, సూరానా గ్రూప్స్ మధ్య మనీ లాండరింగ్ ఒక రేంజ్ లో జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మహేష్ బాబు ఈ సాయి సూర్య డెవలపర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు కాబట్టి, అతన్ని ఈ నెల 27 విచారణకు రావాలని లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థ నుండి మహేష్ బాబు కి 5 కోట్ల 90 లక్షల రూపాయిలు అందాయట. అందులో 3 కోట్ల 50 లక్షలు నగదు రూపంలో, రెండు కోట్ల 50 లక్షల రూపాయిలు RTGS రూప లో మహేష్ ఖాతాలో జమ అయినట్టు తెలుస్తుంది.
ఇది మహేష్ బాబు యాడ్ వీడియో చేసినందుకు తీసుకున్న రెమ్యూనరేషన్ గా భావిస్తున్నారు అభిమానులు. అయితే ఇలా వరుసగా సినిమా వాళ్ళ మీద కేసులు నమోదు అవ్వడం, విచారణకు హాజరు అవ్వమని చెప్పడం ఈమధ్య కాలం లో ఎప్పుడూ జరగలేదు. తెలంగాణాలో ప్రభుత్వం మారిన తర్వాతనే వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయి. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ని అరెస్ట్ చేయాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. కానీ ఆ ఆలోచనని ఆచరణ రూపం లో పెట్టి అరెస్ట్ చేసి చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనే సందేశం వెళ్లేలా చేసాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇది మరికొందరు టార్గెట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. మరి ఈడీ ఆదేశాలను మన్నించి మహేష్ బాబు ఈ నెల 27న విచారణకు హాజరు అవుతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఈ అంశంపై ఆయన మీడియా తో ఏమైనా మాట్లాడుతాడా లేదా అనేది.
Also Read : 3000 మందితో పడవలో మహేష్ బాబు పోరాటం..రాజమౌళి మార్క్ సన్నివేశం!
https://www.youtube.com/live/LgTselrrgoc?si=1uD2vN5rgdlSFUZ6