Mahesh Babu: మంత్రి కొండా సురేఖ రాజకీయ విమర్శల్లో భాగంగా కేటీఆర్ ని విమర్శిస్తూ మధ్యలోకి అక్కినేని కుటుంబాన్ని, సమంత ని లాగి అత్యంత నీచంగా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ మొత్తం చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీ మరియు సమంత తో పాటుగా చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సంయుక్త మీనన్ , మంచు విష్ణు, మంచు మనోజ్ ఇలా ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తనదైన శైలిలో స్పందించాడు.
కాసేపటి క్రితమే ఆయన ట్వీట్ వేస్తూ ‘మా సినీ పరిశ్రమకి చెందిన కుటుంబం పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు నాకు ఎంతో బాధని కలిగించాయి. నేను ఒక అమ్మకి కొడుకుని, ఒక కూతురుకి తండ్రిని, ఒక భార్యకి భర్తని, అలాంటి నేను ఒక మహిళా మంత్రి మరో మహిళపై మీడియా ముందు చేసిన ఈ వ్యాఖ్యలను తీసుకోలేకపోతున్నాను. అందరికీ స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు మనకి రాజ్యం కల్పించింది, కానీ ఆ హక్కుని అవతల వారిని బాధ పెట్టకూడదు. ఇలాంటి చీప్ కామెంట్స్ ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. జనాలకు ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తులు ఒకరి గురించి కామెంట్ చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. దయచేసి మా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారిని సాఫ్ట్ టార్గెట్ చేయకండి. మన దేశంలో మహిళలను దేవత గా చూసి వాళ్ళను గౌరవించాలి’ అంటూ మహేష్ బాబు వ్యాఖ్యానించాడు. మహేష్ బాబు ఇంత ఆవేశం గా ఒక ఘటన పై స్పందించడం ఇన్ని రోజులు మనం చూడలేదు. ఆయన ట్విట్టర్ అకౌంట్ నుండి ఎల్లప్పుడూ శుభాకాంక్షలే కనిపిస్తాయి.
తన తోటి హీరోల సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు వాటిని చూసి తన అభిప్రాయాన్ని చెప్తుంటాడు. అలాగే ప్రతీ హీరో పుట్టినరోజుకు మహేష్ బాబు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి నుండి కూడా ఇంత ఘాటు స్పందన వచ్చిందంటే కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఇండస్ట్రీ మొత్తం ఎంత బాధ పడిందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొండా సురేఖ సమంత కి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్తూ తాను చేసిన కామెంట్స్ ని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ పెద్దల ఆవేశం చల్లారలేదు. ఇండస్ట్రీ వైపు నుండి అందరూ స్పందించారు కానీ, రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ నేడు తిరుపతి లో వారాహి డిక్లరేషన్ సభ హడావుడి లో ఉన్నాడు. మరో పక్క రామ్ చరణ్ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండడం లేదు. నేడు రాత్రి వరకు అయినా వీళ్ళు స్పందిస్తారో లేదో చూడాలి.
Extremely pained by the comments made by Minister Konda Surekha garu on fellow members of our film fraternity. As a father of a daughter, as a husband to a wife and as son to a mother… I am deeply anguished by the unacceptable remarks and language used by a woman minister on…
— Mahesh Babu (@urstrulyMahesh) October 3, 2024