Bigg Boss Telugu 8: ఈ వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మామూలుగా 12 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రావాల్సి ఉండగా, ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కులు ఆది కంటెస్టెంట్స్ నాలుగు వైల్డ్ కార్డు ఎంట్రీలను తప్పించారు. ఇక మిగిలిన 8 మంది కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ ఎపిసోడ్ లో అడుగుపెట్టబోతున్నారు. ఆ 8 మంది ఎవరంటే ముక్కు అవినాష్, రోహిణి, గౌతమ్ కృష్ణ, హరి తేజ, టేస్టీ తేజ, మెహబూబ్, గంగవ్వ. అయితే వీరిలో గంగవ్వ డ్రాప్ అయిపోయినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. యూట్యూబ్ లో ‘మై విలేజ్’ ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన గంగవ్వ, బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ముసలావిడ అయినప్పటికీ కూడా ఈమె టాస్కులు చాలా చురుగ్గా ఆడేది. ఓటింగ్ కూడా అందరి కంటెస్టెంట్స్ కంటే ఎక్కువ వచ్చేది. కానీ ఆమె బిగ్ బాస్ హౌస్ వాతావరణం కి అలవాటు పడలేక పోయింది.
నాల్గవ వారం లోనే ఆమెకి ఆరోగ్యం సహకరించకపోవడంతో నేను వెళ్ళిపోతాను, దయచేసి నన్ను పంపేయండి అని బిగ్ బాస్ ని బ్రతిమిలాడి హౌస్ నుండి వెళ్ళిపోయింది. అయితే వెళ్లే ముందు నాగార్జున ‘గంగవ్వ’ కో ఒక మాట ఇచ్చాడు. నీకు ఇల్లు కట్టుకోవాలని ఒక కల ఉంది కదా, అది బిగ్ బాస్ షో ద్వారా నెరవేర్చుకోవాలని అనుకున్నావు, కానీ మధ్యలోనే ఇలా వెళ్ళిపోయావు, నీకు ఇల్లు నేను కట్టించి ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారమే గంగవ్వకి ఇల్లు కట్టించాడు నాగార్జున. అయితే ఈ సీజన్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఘనంగా ఉండబోతున్నాయని తెలిసిన నాగార్జున బిగ్ బాస్ టీం కి గంగవ్వ ని రీ ఎంట్రీ ఇచ్చేలా చూడండి అని చెప్పాడట. నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ కారణంగా గంగవ్వ ని బిగ్ బాస్ టీం సంప్రదించింది.
గంగవ్వ పాల్గొనడానికి అమితాసక్తిని చూపించింది కానీ, హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ప్రతీ కంటెస్టెంట్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించే లోపలకు పంపుతారు. ఈ ప్రక్రియ లో గంగవ్వ ఫెయిల్ అయ్యింది. వచ్చే వారం నుండి టాస్కులు చాలా హీట్ వాతావరణం లో జరుగుతాయని, వాటిని తట్టుకోవాలంటే ఆరోగ్య పరంగా కూడా దృడంగా ఉండాలని, గంగవ్వ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి ఈ హౌస్ సరిపడదని బిగ్ బాస్ టీం నాగార్జున కి చెప్పారట. దీంతో నాగార్జున కూడా గంగవ్వ కి వద్దులే అని చెప్పేశాడట. ఇప్పుడు ఆమె స్థానంలోకి మరో కంటెస్టెంట్ ని తీసుకునే పనిలో ఉన్నారు బిగ్ బాస్ టీం. అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 6 లో టాప్ 6 వరకు చేరుకున్న శ్రీ సత్య ని అడుగుతున్నారట. మరి ఆమె ఒప్పుకొని వస్తుందో లేదో చూడాలి.