Mahesh And Babu Rajamouli: సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ప్రేక్షకులు వాళ్ళ సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళ సినిమాలు విజువల్ వండర్ గా తెరకెక్కుతుంటాయి. కాబట్టి ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. ఇక దాంతో స్టార్ హీరోల హవా ఎక్కువగా పెరిగిపోయిందనే చెప్పాలి. వాళ్ళు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడానికి కూడా వాళ్ల అభిమానులే కారణమని చాలామంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్నం చేస్తున్న ‘వారణాసి’ సినిమా విషయంలో ఆయన చాలా క్లారిటిగా ఉన్నాడు. మహేష్ బాబు రెమ్యూనరేషన్ కాకుండా ప్రాఫిట్ లో పర్సంటేజ్ ని అడిగిన విషయం తెలిసిందే.
ప్రాఫిట్ లో పర్సంటేజ్ ఇప్పిస్తానని చెప్పిన రాజమౌళి ఇప్పటివరకు ఆ విషయం మీద ఎలాంటి క్లారిటి ఇవ్వలేదట. ఇక దానికి తోడుగా మహేష్ బాబు షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మ్యాటర్ కు సంబంధించిన విషయాలు చర్చించుకునే అవకాశం రావడం లేదంటూ తన సన్నిహిత వర్గాల నుంచి వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా 1500 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతుంది. కాబట్టి ఎలాగైనా సరే 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నాడు. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పర్ఫామెన్స్ ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సైతం ఈ సినిమాతో ప్రపంచ స్థాయి నటుడిగా మారబోతున్నాడనే ఉద్దేశ్యంతో ఆయన ఇప్పటివరకు రెమ్యూనరేషన్ విజయంలో గానీ, పర్సంటేజ్ విషయంలో కానీ చాలా వరకు లైట్ తీసుకున్నాడట.
ప్రస్తుతం అతనికి అనుకున్న రెమ్యూనరేషన్ ఇస్తారా లేదంటే పర్సంటేజ్ ఇస్తారా అనే విషయంలో ఆయన ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నాడు. కాబట్టి దర్శక నిర్మాతలను ఈ విషయంలో స్పష్టం చేయాలని అడుగుతున్నాడట. వాళ్లు కూడా తనకు క్లారిటి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు…
