Bigg Boss Telugu 10: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ వచ్చే నెల 10 వ తేదీన గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా అగ్నిపరీక్ష షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. ఆ ప్రక్రియ కి సంబంధించిన షూటింగ్ కూడా మొదలై మూడు రోజులు పూర్తి చేసుకుంది. నేడు ఆదివారం కావడంతో షూటింగ్ కి బ్రేక్. రేపటి నుండి మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు చివరి రౌండ్ కి ఎంపికైన సామాన్యులు ఎవరు?, ఎవరు రిజెక్ట్ అయ్యారు అనేది మనం ఇది వరకే కథనాల్లో చూసాము. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వీరిలో ఎంత మంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతారో తెలియదు కానీ , కచ్చితంగా వీళ్ళ కారణంగా బ్లాస్టింగ్ రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయని మాత్రం చెప్పొచ్చు.
ఇదంతా పక్కన పెడితే , ఈ సీజన్ ఎలాంటి కాన్సెప్ట్ తో మొదలు కాబోతుంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. గత సీజన్ లో సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి , సెలబ్రిటీలకు అవుట్ హౌస్ లో ఉండేలా చేశారు బిగ్ బాస్ టీం. ఈ కాన్సెప్ట్ పెద్ద హిట్ అయ్యింది. హౌస్ లో మొదటి రోజు నుండే గొడవలు మొదలయ్యాయి , బోలెడన్ని నామినేషన్ పాయింట్స్ దొరికాయి. ఈ సీజన్ లో కూడా అలాంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయబోతున్నారని టాక్. అయితే గతం లో లాగా కాకుండా , ఈసారి ‘స్వర్గం – నరకం’ అనే కాన్సెప్ట్ ని తీసుకొని రాబోతున్నట్టు గుసగుసలు.
స్వర్గం అంటే నామినేషన్ లో లేని కంటెస్టెంట్స్. వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు, వీళ్లకు వారం మొత్తం అన్ని రకాల భోగాలు ఉంటాయి. ఇక నరకం అంటే నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్. వీళ్ళు హౌస్ బయట , ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లో ఉంటారు. స్వర్గం లో ఉన్న కంటెస్టెంట్స్ కి అన్ని రకాల సౌకర్యాలు ఉంటే , నరకం లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఎలాంటి సౌరకార్యాలు ఉండవు. వీళ్లంతా నేల మీదనే పడుకోవాలి, వీళ్లకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా వీళ్ళే తయారు చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ లాంటివి ఏమి ఉండవు. ఏదైనా ఆహరం కావాలంటే స్వర్గం లో కంటెస్టెంట్స్ ని బ్రతిమిలాడి తీసుకోవాలి. కన్నడ బిగ్ బాస్ లో ఈ కాన్సెప్ట్ ని ప్రవేశ పెట్టారు , అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి ఇక్కడ కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.