Homeఎంటర్టైన్మెంట్Mahavatar Parashuram Glimpse: గూస్ బంప్స్ రప్పిస్తున్న 'మహావతార్ పరశురామ్' గ్లింప్స్ వీడియో.. అవేమి విజువల్స్...

Mahavatar Parashuram Glimpse: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘మహావతార్ పరశురామ్’ గ్లింప్స్ వీడియో.. అవేమి విజువల్స్ సామీ..

Mahavatar Parashuram Glimpse: గత ఏడాది విడుదలైన ‘మహావతార్ నరసింహా’ చిత్రం పాన్ ఇండియా లెవెల్ సృష్టించిన సునామీ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా.. కేవలం పాతిక కోట్ల రూపాయిల బడ్జెట్ తో, అద్భుతమైన యానిమేషన్ విజువల్స్ ని చూపించడం తో , జనాలు క్యూలు కట్టేశారు. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘మహావతార్ పరశురామ్’ చిత్రం వస్తుందని హోమబుల్ సంస్థ ‘మహావతార్ […]

Mahavatar Parashuram Glimpse: గత ఏడాది విడుదలైన ‘మహావతార్ నరసింహా’ చిత్రం పాన్ ఇండియా లెవెల్ సృష్టించిన సునామీ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా.. కేవలం పాతిక కోట్ల రూపాయిల బడ్జెట్ తో, అద్భుతమైన యానిమేషన్ విజువల్స్ ని చూపించడం తో , జనాలు క్యూలు కట్టేశారు. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘మహావతార్ పరశురామ్’ చిత్రం వస్తుందని హోమబుల్ సంస్థ ‘మహావతార్ నరసింహా’ చివర్లో హోమబుల్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియో ని మేకర్స్ విడుదల చేశారు. దీనికి నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మొదటి భాగం పెద్ద హిట్ అవ్వడం తో , ఈ సినిమాకు భారీ లెవెల్ లోనే ఖర్చు చేశారని ఈ గ్లింప్స్ వీడియో ని చూస్తేనే తెలుస్తోంది.

తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఒక యానిమేషన్ చిత్రానికి ఇంత సమయం తీసుకుంటున్నారంటే , ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. కచ్చితంగా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత స్టామినా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సెన్సేషనల్ కాంబినేషన్స్ లో తెరకెక్కబోయే సినిమాలు రాబోతున్నాయి. అందులో ‘మహావతార్ పరశురామ్’ చిత్రం కూడా చేరబోతోంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. పరశురాముడు శ్రీ మహావిష్ణువు 6 వ అవతారం. ఈయన ఒక చిరంజీవి . ఇప్పటికీ హిమాలయాల్లో మానవులు ప్రవేశించలేని ప్రదేశం లో ఉంటూ జపం చేసుకుంటున్నాడని అందరూ బలంగా నమ్ముతుంటారు.

ఈయన జమదగ్ని , రేణుక దంపతులకు జన్మించిన బిడ్డ. మహాశివుడు ఈయనకు ఒక గొడ్డలి ని బహుమతిగా ఇస్తాడు. తన తండ్రిని అన్యాయంగా చంపేసిన క్షత్రియులపై ఏకంగా 21 సార్లు దండయాత్ర చేసి ఊచకోత కోశాడు పరశురాముడు. అంతే కాదు , తన తండ్రి మాటని జవదాటని వ్యక్తిగా పరశురాముడి ఒక గొప్ప పేరుంది. ఆయన తన తల్లి రేణుక ని చంపమని ఆదేశించగా, తండ్రి ఆదేశాన్ని పాటిస్తూ ఆ పని చేస్తాడు పరశురాముడు. ఆ తర్వాత ఆయన వద్ద వరం పొంది, తన తల్లిని మళ్లీ బ్రతికించుకుంటాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ కథలో ఉంటాయి. వాటిని లైవ్ యానిమేషన్ ద్వారా హోమబుల్ సంస్థ ఎలా చూపించబోతుందో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ‘మహావతార్ పరశురామ్’ చిత్రం గ్లింప్స్ వీడియో ని మీకోసం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper