Allu Arjun SIIMA Award: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళు చేసిన సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నారు. నిజానికి ఒక సినిమాతో సక్సెస్ ని సాధించాలి అంటే ఆ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉండాలి. మరి ఆ సినిమాకి అవార్డు వరించాలి అంటే అందులో ఆ నటుల యొక్క నటన నెక్స్ట్ లెవల్ లో ఉండి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా ఉన్నప్పుడే అవార్డులు సొంతమవుతాయి. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అర్జున్ లాంటి సైతం ఈ మధ్యకాలంలో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ను ఇస్తూ అవార్డుల మీద అవార్డులను కొల్లగొడుతున్నారు. పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఆయనకు నేషనల్ అవార్డు అయితే వచ్చింది. ఇక గత సంవత్సరంలో ఆయన చేసిన పుష్ప 2 సినిమాకి గాను అతనికి సైమా అవార్డ్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన ప్రాణం పెట్టి నటించాడు. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ ఎలాగైతే ఉంటాడో అలాంటి ఒక రా క్యారెక్టర్ లో నటించాడు. ఇక రెండో పార్ట్ లో సిండికేట్ మెంబర్ గా మంచి పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు.
Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు
మొత్తానికైతే ఈ సినిమా బాహుబలి 2 రికార్డ్ ను సైతం కొల్లగొట్టి 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఈ సినిమాలో నటించినందుకు గాను అల్లు అర్జున్ కి సైమా అవార్డు వరించడంతో అతని అభిమానులందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరి ఇప్పటివరకు ఆయనకు మూడు సైమ అవార్డులైతే వచ్చాయి. మొదటిది 2016 వ సంవత్సరంలో ‘రుద్రమదేవి’ సినిమాలో ‘గోన గన్నరెడ్డి’ పాత్రను పోషించినందుకు గాను అతనికి బెస్ట్ యాక్టర్ గా అవార్డు అయితే వరించింది. ఇక దాని తర్వాత 2021 వ సంవత్సరంలో వచ్చిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమాలు నటించినందుకు గానీ ఉత్తమ నాయకుడిగా రెండోవసారి సైమా అవార్డు అందుకున్నాడు.
ఇక ముచ్చటగా మూడోసారి పుష్ప 2 సినిమా కోసం అతనికి సైమా అవార్డు వరించడం అనేది ఇపుడు ప్రతి ఒక్కరని ఆనందపడేలా చేస్తోంది. మరి మొత్తానికైతే పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్న క్రమంలో మన స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇస్తూ ది బెస్ట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతుండటం విశేషం…తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నటుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు…