https://oktelugu.com/

మాధవీలత టిక్ టాక్ వీడియో వైరల్

సినీనటి, బీజేపీ మహిళ నాయకురాలు మాధవీలత కరోనాపై చేసిన టిక్ టాక్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కరోనాపై కవితను చదువుతూ ఒక్కనిమిషంలోనే జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలా చేశారంటూ ఆమె వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనాకు రాజు, పేద తేడాలేదని ఎవరైనా ఒకటేనని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా కరోనా బారిన పడాల్సిందేనని చెప్పారు. ప్రతీఒక్కరూ స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ‘మొదటి అంకె నేను అని.. మొదటి స్థానం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 7, 2020 / 03:50 PM IST
    Follow us on


    సినీనటి, బీజేపీ మహిళ నాయకురాలు మాధవీలత కరోనాపై చేసిన టిక్ టాక్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కరోనాపై కవితను చదువుతూ ఒక్కనిమిషంలోనే జీవితం అంటే ఏంటో అర్థమయ్యేలా చేశారంటూ ఆమె వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనాకు రాజు, పేద తేడాలేదని ఎవరైనా ఒకటేనని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా కరోనా బారిన పడాల్సిందేనని చెప్పారు. ప్రతీఒక్కరూ స్వీయనియంత్రణ పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

    ‘మొదటి అంకె నేను అని.. మొదటి స్థానం నాది అని.. మొదటి నుంచి విర్రవీగే మొదటిరకం పొగురుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అంటూ మాధవీలత చెప్పిన కవితకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చెప్పిన కవితకు నెటిజన్ల నుంచి మంచి స్పందిన లభిస్తుంది. ఇప్పటికే ఈ వీడియో 4.4లక్షలమందికి పైగా వీక్షించారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 35వేల మంది లైకులు వచ్చాయి. మాధవీలత మీ కవిత బాగుంది.. ఒక్క నిమిషంలోనే జీవితం అంటే ఏంటో తెలియజేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం విశేషం. మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూడండి..