కరోనా కట్టడికి సోనియాగాంధీ సూచనలు

భారత్ లో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14తో లాక్డౌన్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ కొనసాగించాలా? లేక ఎత్తివేయాలా? అనేదానిపై కేంద్ర మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే కరోనాను అరికట్టడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పలు సూచనలు చేశారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఐదు సూచనలతో కూడిన లేఖను రాశారు. భారత్ లో […]

Written By: Neelambaram, Updated On : April 7, 2020 4:02 pm
Follow us on


భారత్ లో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజులపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14తో లాక్డౌన్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ కొనసాగించాలా? లేక ఎత్తివేయాలా? అనేదానిపై కేంద్ర మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే కరోనాను అరికట్టడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పలు సూచనలు చేశారు. ఈమేరకు ప్రధాని మోదీకి ఐదు సూచనలతో కూడిన లేఖను రాశారు.

భారత్ లో కరోనా కట్టడికి చేసేందుకు ప్రధాని మోదీ సోనియాకు ఫోన్ చేసి సలహాలు కోరారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ మోదీకి లేఖరాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీల జీతాల కోతకు సోనియాగాంధీ మద్దతు పలికారు. మీడియా అడ్వర్టైజ్ మెంట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపివేయాలని తెలిపారు. ప్రస్తుత చారిత్రాత్మక పార్లమెంటులోనే కార్యకలాపాలు కొనసాగించాలన్నారు.

ప్రభుత్వ ఖర్చును 30శాతం తగ్గించుకోవాలని సూచించారు. కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలని కోరారు. పీఎం కేర్స్ నిధులను, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని కోరారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ధనం ఆదా అవుతుందని ఆమె సూచించారు. ఈ డబ్బును కరోనాను కట్టడి చర్యలకు ఉపయోగించాలని సోనియా గాంధీ ప్రధాని రాసిన లేఖలో కోరారు.