MAD Square: ఈ సమ్మర్ లో విడుదల అవ్వబోతున్న సినిమాలలో యూత్ ఆడియన్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరంలో విడుదలైన మ్యాడ్ చిత్రానికి ఇది సీక్వెల్. మొదటి భాగం మొత్తం కాలేజీ నేపథ్యం లో సాగితే, రెండవ భాగం లడ్డు పెళ్లి నేపథ్యం లో సాగుతుంది అనే విషయం మనకి టీజర్ ని చూసినప్పుడే అర్థమైపోయింది. పొట్ట చెక్కలయ్యే కామెడీ తో ప్రేక్షకులు పగలబడి నవ్వుకునే రేంజ్ లో ఈ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) తెరకెక్కించాడు అనే విషయం ఈపాటికే అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అయితే ఈ సినిమాని ముందుగా మార్చి 29న విడుదల చేస్తామని అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. కానీ ఆరోజు అమావాస్య అవ్వడంతో మార్చి 28న విడుదల చేయాలని బయ్యర్స్ ప్రత్యేకంగా కోరారట. వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారమే ఈ సినిమాని మార్చి 28న విడుదల చేయబోతున్నామని కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
అయితే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా విడుదలైతే, మా సినిమాని వాయిదా వేస్తామని నిన్న కూడా ప్రెస్ మీట్ లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు నాగ వంశీ. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మేకర్స్ మార్చి 28న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసి చాలా రోజులే అయ్యింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం, అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన నాలుగు రోజుల షూటింగ్ మిగిలి ఉండడం, ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉండడంతో డేట్స్ కేటాయించకపోవడం వల్ల ఈ సినిమాని మార్చి 28 న విడుదల చేయడం కష్టమే అని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ అనుకున్న ప్రకారం ఆ సినిమాని విడుదల చేయాలని అనుకుంటే, ‘మ్యాడ్ స్క్వేర్’ తో పాటు, నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా వాయిదా పడుతుంది.
పవన్ కళ్యాణ్ సినిమా రాదు అనే క్లారిటీ ఉండడం వల్లే, ఈ రెండు సినిమాలు మార్చి 28 న విడుదల అవుతున్నాయి. నితిన్ సినిమా థియేటర్స్ లో విడుదలై చాలా కాలం అయ్యింది. గతంలో ఆయనతో భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వంగా వహించగా, శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రంతో పోలిస్తే ‘రాబిన్ హుడ్’ పై అంచనాలు ఏ మాత్రం లేవు. కానీ ఉగాది, రంజాన్, శ్రీ రామనవమి వంటి పందులు వరుసగా వచ్చే సీజన్ కావడంతో ఈ ధైర్యం చేసి ‘మ్యాడ్ స్క్వేర్’ కి పోటీ గా దిమ్పేస్తున్నాడు. చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.
Also Read: ఈ ముగ్గురు దర్శకులను నట్టేట ముంచేసిన పవన్ కళ్యాణ్…