https://oktelugu.com/

Kia Electric Car : Kia నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవుతారు..

Kia Electric Car : ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు హవా పెరుగుతున్న తరుణంలో ఆ వేరియంట్ లోనే చాలా కంపెనీలు కార్లను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కియా కంపెనీ ఓ కారును తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిని ముందుగా సొంత దేశంలోనే రిలీజ్ చేయనుంది.మరి ఈ కారు ఎలా ఉందో తెలుసుకుందాం..

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2025 / 04:45 PM IST
    Kia Electric Car

    Kia Electric Car

    Follow us on

    Kia Electric Car :  దక్షిణ కొరియా కంపెనీకి చెందిన Kia కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉంది. దీని ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో స్థాపించారు. అక్కడ నుంచి వివిధ కార్లు ఉత్పత్తి అయి దేశంతో పాటు విదేశాలకు విక్రయిస్తున్నారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే సెల్టోస్ వంటి ప్రముఖ కార్లు రోడ్లపై తిప్పుతున్నారు. అయితే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను పరిచయం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు హవా పెరుగుతున్న తరుణంలో ఆ వేరియంట్ లోనే చాలా కంపెనీలు కార్లను పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కియా కంపెనీ ఓ కారును తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీనిని ముందుగా సొంత దేశంలోనే రిలీజ్ చేయనుంది.మరి ఈ కారు ఎలా ఉందో తెలుసుకుందాం..

    Kia కంపెనీ నుంచి సెడాన్, హ్యాచ్ బ్యాక్ వేరియంట్లలో కార్లను అందుబాటులో ఉంచబోతుంది. ఈ రెండు కార్లు విద్యుత్ వేరియంట్ లో లభించనున్నాయి. అయితే ఇవిICE వేరియంట్ లో వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కానీ విద్యుత్ కార్లు మాత్రం అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. ఇవి కూడా సొంత దేశం అయిన దక్షిణ కొరియాలో రిలీజ్ చేయనున్నారు. అయితే కార్ల గురించిన వివరాలు బయటకు రావడంతో వీటి గురించి చర్చించుకుంటున్నారు.

    Also Read : వచ్చేసింది కియా సైరోస్.. ధర రూ. 9 లక్షలతో ప్రారంభం.. ఈ కారు టాప్ మోడల్ ధర ఎంత ?

    కంపెనీ నుంచి చేసే అంచనా ప్రకారం.. Kia కంపెనీ నుంచి Ev4 అనే కారు మార్కెట్లోకి రాబోతుంది. దీనిలో ఉండే ఫీచర్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ కారులో రెండు బ్యాటరీలు అమర్చనున్నారు. ఇందులో ఒకటి 58.3 కిలో వాట్, రెండోది 81.4 కిలో వాట్ అనే రెండు బ్యాటరీలు ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తిగా చార్జింగ్ చేస్తే 430 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. రెండో బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 630 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

    ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ మైలేజ్ విషయాన్ని కూడా ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ కారును మార్కెట్లోకి తీసుకురావడంతో ఎంతో ప్రయోజనం ఉంటుందని అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అంతేకాకుండా ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తే దూర ప్రయాణాలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా ఫాస్టెస్ట్ ఛార్జింగ్ కావడంతో చాలా మంది దీని కోసం ఆరాటపడే అవకాశం ఉంటుంది. అయతే ఇది ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

    కియా నుంచి మార్కెట్లోకి వస్తున్న ఈ కారులో ఫీచర్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి. ఈ కారులో ఎల్ ఈడీ, డీఆర్ఎల్, తో పాటు డ్యూయెల్ టోన్, అల్లాయ్ వీల్స్, తో పాటు ప్రయాణికుల రక్షణకు అడాస్ ఫీచర్, 3.0 రీజెనరేటర్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ మార్చి 4న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తగా కారు కొనాలని అనుకునేవారితో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ లో కారును పొందాలని అనుకునేవారు ఈ కారు బెస్ట్ అప్షన్ అని అంటున్నారు.

    Also Read : కియా ఈవీ2 : అతి చౌకైన ఎలక్ట్రిక్‌ కారు.. ధర ఎంత? లాంచింగ్‌ డేట్ ఇదీ