Mad Square : యూత్ ఆడియన్స్ ఒక సినిమాని నచ్చితే, ఎక్కడికి తీసుకెళ్లి ఆపుతారో వాళ్ళకే తెలియదని ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతుంటారు. లాంగ్ రన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ మీద ఆధారపడాల్సి వస్తుందేమో కానీ, ఒక సినిమాకు కళ్ళు చెదిరే రేంజ్ ఓపెనింగ్స్ రావాలంటే యూత్ ఆడియన్స్ వల్లనే సాధ్యం అవుతుంది. రీసెంట్ గా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. 2023 వ సంవత్సరం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్. అందుకే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన రోజు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా టీజర్, ట్రైలర్ చాలా ఫన్నీ గా ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయింది. విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, 3 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : 22 కోట్ల టార్గెట్..కానీ 2 రోజుల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా!
ఒకప్పుడు ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి వంటి లెక్కలు అందుబాటులో ఉండేది కాదు. నిర్మాతలు ఎంత చెప్తే అంత నమ్మేవాళ్లం. కానీ ఇప్పుడు బుక్ మై షో లో రోజుకి ఎన్ని టిక్కెట్లు అమ్మడుపోతున్నాయి, గంటకు ఎన్ని టికెట్స్ సేల్ అవుతున్నాయి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ‘మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి బుక్ మై షో యాప్ డేటా ప్రకారం 1 లక్ష 65 వేల టిక్కెట్లు నిన్న ఒక్క రోజునే అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 5 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది కేవలం బుక్ మై షో లెక్కలు మాత్రమే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే జనాలు అత్యధిక శాతం టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ‘డిస్ట్రిక్ట్’ యాప్ ని వాడుతున్నారు.
కాబట్టి రెండు యాప్స్ ని కలిపి చూస్తే ఈ సినిమాకు కచ్చితంగా మూడు రోజుల్లో 1 మిలియన్ కి పైగానే టికెట్స్ సేల్ అయ్యాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మూడవ రోజు ఉగాది కావడం తో ప్రతీ ఒక్కరు ఈ సినిమాకు క్యూలు కట్టేసారు. అందుకే ఈ చిత్రానికి మూడవ రోజున
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 50 లక్షలు షేర్, ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 50 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు రంజాన్ పండుగ కావడం తో ఈ నేడు కూడా ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయిల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని, నేటితో 30 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..ఊహించని బీభత్సం!