Sangeeth Shobhan , Niharika
Sangeeth Shobhan and Niharika : కేవలం ఒకే ఒక్క సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో సంగీత్ శోభన్(Sangeeth Sobhan). ‘మ్యాడ్’ చిత్రం లో ఈ కుర్రాడి కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వని మనిషంటూ ఎవ్వరూ ఉండరు. అంత అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతోనే కచ్చితంగా ఇతగాడు భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్లాడని అందరూ చాలా బలంగా నమ్మారు. రీసెంట్ గా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రంలో కూడా ఈ కుర్రాడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సిరీస్ లో ముగ్గురు హీరోలు ఉన్నప్పటికీ, సంగీత్ శోభన్ అంత హైలైట్ అయ్యాడంటే కచ్చితంగా ఆయన టాలెంట్ ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు. అందరూ ఊహించినట్టుగానే ఇతగాడికి సినిమా అవకాశాలు క్యూలు కడుతున్నాయి. మ్యాడ్ సిరీస్ కి ముందు సంగీత్ శోభన్ పలు వెబ్ సిరీస్ లు చేసాడు. అందులో తన అన్నయ్య సంతోష్ శోభన్ తో కలిసి చేసిన ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ సినిమా కూడా ఉంది.
Also Read : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరుకోకూడదు – నిర్మాత నాగవంశీ
అలా వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమ్ ని సొంతం చేసుకున్న సంగీత్ శోభన్ కి మ్యాడ్ లో నటించే అవకాశం దక్కింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం ఆయన నిహారిక కొణిదెల(Niharika Konidela) నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ లో ఒక సినిమా చేయడానికి సంతకం చేసాడు. గతం లో నిహారిక సంగీత్ శోభన్ ని హీరో గా పెట్టి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ చేసింది. ‘జీ5’ యాప్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సంగీత్ తో ఆమె ఫీచర్ ఫిల్మ్ చేయబోతుంది. ఈ సినిమా కూడా మ్యాడ్ తరహా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని టాక్.
డైరెక్టర్ ఎవరు?, ఎప్పటి నుండి ఈ సినిమాని ప్రారంభించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం తో మొట్టమొదటిసారి సిల్వర్ స్క్రీన్ సినిమాకు నిర్మాతగా మారిన నిహారిక కొణిదెల, ఆ సినిమాతో ఎంత పెద్ద సక్సెస్ ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేస్తే, దాదాపుగా పది కోట్ల రూపాయిల షేర్ థియేటర్స్ నుండి, 15 కోట్ల రూపాయలకు సాటిలైట్ + డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా 20 కోట్ల రూపాయలకు పైగానే లాభాలను అందుకుంది అన్నమాట. ఇప్పుడు నిహారిక యూత్ లో ట్రెండ్ అవుతున్న సంగీత్ శోభన్ తో సినిమా చేస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆమె ఏ రేంజ్ లాభాలను అందుకుంటుందో చూడాలి.
Also Read : ఒకడు కాదు ఇద్దరు..’హిట్ 3′ నుండి కీలక ట్విస్ట్ లీక్!