Maa Nanna Superhero Review: ‘మా నాన్న సూపర్ హీరో’ ఫుల్ మూవీ రివ్యూ…

ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : October 10, 2024 9:29 am

Maa Nanna Superhero Review

Follow us on

Maa Nanna Superhero Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలే కాకుండా మీడియం రేంజ్ హీరోలు కూడా వరుసగా మంచి కంటెంట్లను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సుధీర్ బాబు వరుసగా మంచి సినిమాలు చేయడానికి చాలావరకు అసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు కొంత వరకు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి సుధీర్ బాబు చేస్తున్న సినిమాలేవి ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించడం లేదు. ఇక ముఖ్యంగా ఆయన ఎంచుకున్న పాయింట్స్ కూడా అంత యూనిక్ గా ఉండకపోవడం వల్లే ఆయనకి వరుసగా ఫ్లాప్ సినిమాలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఆయన ప్రస్తుతం ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఈ సినిమా కథ విషయానికి వస్తే జానీ(సుధీర్ బాబు) అనే ఒక పిల్లాడు పుట్టిన తర్వాత తన తండ్రి(సాయి చంద్) తనని ఒక అనాధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోతాడు. ఇక అక్కడి నుంచి ఆ పిల్లాడిని మరొక వ్యక్తి (షాయాజి షిండే) అడాప్ట్ చేసుకుంటాడు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విడిచిపెట్టిన తండ్రి మళ్ళీ తన కొడుకు కావాలని తనకి దగ్గర అవ్వాలని చూస్తాడు. ఈ ప్రాసెస్ లో తనకి తన కన్న తండ్రి మీద కోపం వస్తుంది. తండ్రి అంటే కన్నడం మాత్రమే కాదు. ఆ పిల్లలని పెంచాలి అనే ఒక పాయింట్ తో జానీ ఉంటాడు. మరి వీళ్ళ మధ్య జరిగే ఒక కన్వర్జేషన్ లో జానీ తనను కన్న తండ్రి వైపు ఉన్నాడా? లేదా పెంచిన తండ్రి వైపు మొగ్గు చూపించాడా? అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే దర్శకుడు అభిలాష్ కంకర రాసుకున్న పాయింట్ చాలా యూనిక్ గా ఉన్నప్పటికీ ఆయన తెరకెక్కించిన విధానం అయితే చాలా మెలో డ్రామాగా సాగింది. ఇక మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా సుధీర్ బాబు, సాయి చంద్ మధ్య వచ్చే సీన్స్ కానీ అలాగే సుధీర్ బాబు సీన్స్ గాని వీటన్నింటిని బేస్ చేసుకొని సాగే ఈ సినిమా కంటెంట్ అనేది చాలా అద్భుతంగా రూపొందించాడు. నిజానికి ఫస్ట్ హాఫ్ కొంత ఎమోషనల్ డ్రామాగా ముందుకు సాగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా పే హాఫ్ ఇవ్వాల్సినంత ఇవ్వలేదనేది మాత్రం కొంతవరకు మనకు క్లియర్ గా అర్థమవుతుంది.

అయితే ఫైట్ సీక్వెన్స్ ని పెట్టే స్కోప్ ఉన్నప్పటికీ అనవసరమైన ఎలివేషన్స్ ఫైట్ సీక్వెన్స్ లకు వెళ్లకుండా ఒక జెన్యూన్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ ని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా సుధీర్ బాబు నటుడిగా మరొక మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి. ఇక అభిలాష్ రాసుకున్న స్క్రీన్ ప్లే గాని, డైరెక్షన్ గాని ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. అందువల్లే ఈ సినిమా విషయంలో వాళ్ళు ఎక్కడ తగ్గకుండా ముందుకు సాగుతూ ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యం తోనే చివరి వరకు తాపత్రయ పడుతూ ముందుకు సాగారు…

అయినప్పటికీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ మెంట్ చేసి ఉంటే బాగుండేదని ఒక ఫీల్ అయితే కలుగుతుంది. ఇక మొత్తానికైతే ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఓకే అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ గాని, క్లైమాక్స్ లో గాని ఇంకొంచెం రైటింగ్ లో జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రను పోషించాడు. ఇప్పటివరకు ఆయన అలాంటి పాత్రలను చేయడం మనం చూడలేదు. కానీ ఈ సినిమాలో మాత్రం అవుట్ అండ్ అవుట్ ఒక డిఫరెంట్ వేరియేషన్ తో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే సొంతం చేసుకున్నాడు. ఇక సాయి చందు కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

షియాజీ షిండే సైతం ప్రేక్షకుల్లో ఒక మూడ్ ను క్రియేట్ చేయడానికి అహర్నిశలు కష్టపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా చేసిన అర్న వోహ్రా కూడా చాలా బాగుంది. ఆమె కేవలం స్కిన్ షో కి మాత్రమే పరిమితం అవ్వకుండా కథలో కూడా లీనమవుతూ ఆమె పాత్రను మలిచిన తీరైతే చాలా అద్భుతంగా ఉంది. ఇక విష్ణు ఓయి, రాజు సుందరం లు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా కి జై క్రిష్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను చాలా వరకు కట్టిపడేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అందరిని ఎమోషనల్ గా మార్చడంలో ఆయన మ్యూజిక్ అయితే చాలావరకు కీలకపాత్ర వహించిందనే చెప్పాలి…. ఇక సినిమాటోగ్రాఫర్ సమీర్ కళ్యాణి అందించిన విజువల్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలిపాయనే చెప్పాలి. ఒక్కో షాట్ ని తను మలిచిన తీరైతే అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో కూడా తన మార్క్ చూపిస్తూ ముందుకు తీసుకెళ్లాడు. అలాంటి ఒక సినిమాటోగ్రాఫర్ దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టమనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

కథ
సుధీర్ బాబు యాక్టింగ్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే
హెవి మెలో డ్రామా

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్

ఈ పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి చూడచ్చు…