https://oktelugu.com/

Vettaiyan Movie Review: వేట్టయన్ ఫుల్ మూవీ రివ్యూ…

తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ సక్సెస్ కూడా సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన జ్ఞానవెల్ డైరెక్షన్ లో చేసిన 'వేట్టయన్' సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది రజినీకాంత్ కెరియర్ లో మరొక సక్సెస్ సాధించాడా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written By:
  • Gopi
  • , Updated On : October 10, 2024 / 09:43 AM IST

    Vettaiyan Movie Review

    Follow us on

    Vettaiyan Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు. తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తూ సక్సెస్ కూడా సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన జ్ఞానవెల్ డైరెక్షన్ లో చేసిన ‘వేట్టయన్’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది రజినీకాంత్ కెరియర్ లో మరొక సక్సెస్ సాధించాడా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో రజనీకాంత్ ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ గా మనకు కనిపించాడు. ముఖ్యంగా సిటీలో జరుగుతున్న కొన్ని మర్డర్ మిస్టరీలను సాల్వ్ చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి ఆ హంతకుడిని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేశాడా? ఇక ఇంతకీ ఆ హంతకుడు ఎవరు వాడి మోటివ్ పాయింట్ ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే టీ జీ జ్ఞానవెల్ తను రాసుకున్న కథ ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ముఖ్యంగా రజనీకాంత్ మీద ఆయన రాసుకున్న సీన్లు థియేటర్ లో ప్రేక్షకుల చేత ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ చెప్పిన డైలాగులు కూడా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఇక జ్ఞానవెల్ సక్సెస్ ఫుల్ గా డీల్ చేయడంలో సిద్ధహస్తుడనే విషయం మనకు తెలిసిందే. ఆయన సూర్యతో చేసిన జై భీమ్ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ ను చాలా ఈజీగా ప్రేక్షకులకు నచ్చే విధంగా కన్వే చేసిన విధానం అయితే ప్రేక్షకులందరికీ నచ్చింది.

    ముఖ్యంగా ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యమైతే మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మలచడంలో ఆయన చాలావరకు సక్సెస్ సాధించాడు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ను పెట్టుకొని ఒక మాస్ మసాలా సినిమా చేయకుండా ఇలాంటి ఒక కంటెంట్ బేస్డ్ సినిమాని చేయడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి అనురుధ్ అందించిన మ్యూజిక్ అయితే కొన్ని సీన్లని ఎలివేట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ అయింది.

    ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ చాలావరకు యూజ్ అయిందనే చెప్పాలి…ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉండడం ఈ సినిమా సక్సెస్ కి చాలా వరకు కలిసి వస్తుందనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో రజనీకాంత్ తనదైన రీతిలో నటించి మెప్పించాడు. ఇక ముఖ్యంగా ఆయన చేసిన పాత్ర ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక అవుట్ అండ్ అవుట్ ఆయన ఈ సినిమాని తన భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఇక రజనీకాంత్ స్వాగ్ అయితే ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఆయన స్టైల్ గాని, ఆయన చేసిన మేనరిజమ్స్ కానీ ప్రేక్షకులందరి చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే మంజు వారియర్ పాత్ర కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. ముఖ్యంగా ఆమె పోషించిన పాత్ర ఈ సినిమాలోని కథని ఎలివేట్ చేయడంలో చాలావరకు యూజ్ అయింది. అలాగే అమితాబచ్చన్ లాంటి దిగ్గజ నటుడు కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక ఫాహద్ ఫజిల్ లాంటివారు సైతం తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు…

    ఇక ఏది ఏమైనప్పటికీ వీళ్లంతా సినిమాలో నటించడం వల్ల సినిమాకి చాలావరకు హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరి పాత్ర లో కూడా సెపరేట్ వేరియేషన్ లో ఉండడం సినిమా చూసిన ప్రేక్షకుడికి కూడా బాగా నచ్చింది… ఇక మిగిలిన పాత్రలో నటించిన వారందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. అనిరుద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడమే కాకుండా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. ఇక రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాకి కూడా తన మ్యూజిక్ ని అందించి మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ని ఇస్తూ ప్రేక్షకులందరిని కట్టిపడేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు… ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. కొన్ని రివిలింగ్ సీన్స్ ని సినిమాటోగ్రాఫర్ చాలా క్యూరియాసిటీతో తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా చాలా వరకు షార్ప్ ఎడ్జ్ లో కట్ చేశారు…

    ప్లస్ పాయింట్స్

    కథ
    రజినీకాంత్
    మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి…
    మొదట్లో కథను ఎస్టాబ్లిష్ చేసిన విధానం అంత ఇంప్రెసివ్ గా లేదు…

    రేటింగ్

    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

    చివరి లైన్
    చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ రజినీకాంత్ కనిపించాడు…