https://oktelugu.com/

Vettiyan Twitter Talk: ‘వెట్టియాన్’ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..ఫస్ట్ హాఫ్ ‘జైలర్’ ని మించిపోయింది..కానీ సెకండ్ హాఫ్ మాత్రం!

సెకండ్ హాఫ్ కి మాత్రం ఆ స్థాయి రివ్యూ లు ట్విట్టర్ నుండి రాలేదు. 'జైలర్' చిత్రానికి కూడా ప్రారంభంలో సెకండ్ హాఫ్ కి ఇలాంటి టాక్ వచ్చింది, కానీ తర్వాత చిన్నగా టాక్ నిలబడింది, ఫలితంగా ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 11:45 am
    Vettiyan Movie Team

    Vettiyan Movie Team

    Follow us on

    Vettiyan Twitter Talk: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వెట్టియాన్’ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను ఏర్పాటు చేసింది. అనిరుద్ అందించిన రెండు పాటలు సెన్సేషనల్ హిట్ అవ్వడం తో పాటు, థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియన్స్ కి నచ్చడంతో రజినీ కాంత్ నుండి ‘జైలర్’ తర్వాత మరో మంచి సినిమా రాబోతుంది అనేది అందరికీ అర్థం అయ్యింది. అలాంటి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకి ట్విట్టర్ లో మంచి పాజిటివ్ టాక్ నడుస్తుంది. సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా డైరెక్టర్ ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ కూర్చొని చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యాడని, మధ్యలో ఫ్యాన్స్ కోసం రజినీకాంత్ మార్క్ హీరోయిజం, స్టైల్ ని కూడా జోడించాడని మంచి రిపోర్ట్ వచ్చింది.

    కానీ సెకండ్ హాఫ్ కి మాత్రం ఆ స్థాయి రివ్యూ లు ట్విట్టర్ నుండి రాలేదు. ‘జైలర్’ చిత్రానికి కూడా ప్రారంభంలో సెకండ్ హాఫ్ కి ఇలాంటి టాక్ వచ్చింది, కానీ తర్వాత చిన్నగా టాక్ నిలబడింది, ఫలితంగా ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘వెట్టియాన్’ కూడా అలాగే అవుతుందని అంటున్నారు. ‘వెట్టియాన్’ సెకండ్ హాఫ్ పెద్దగా బాగాలేదు అనే టాక్ ఎందుకు వచ్చిందంటే, సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద రన్ అవ్వడం, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండడం, ఆడియన్స్ బుర్రకి కాస్త ఎక్కువ పని పెట్టినట్టుగా అనిపిస్తుంది, కొన్ని చోట్ల చిరాకు కూడా పుడుతుందని సినిమాని చూసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం కచ్చితంగా ఒక్కసారి చూడొచ్చు, ఈ చిత్రాన్ని పూర్తిగా కమర్షియల్ సినిమా అని అనలేము, అలా అని పూర్తిగా సందేశాత్మక చిత్రం అని కూడా అనలేము అనే టాక్ కూడా నడుస్తుంది.

    రజనీకాంత్ అద్భుతమైన నటన, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ మరియు రానా దగ్గుపాటి నటనలు ఈ సినిమాని నిలబెట్టాయి. అలాగే డైరెక్టర్ జ్ఞాన్ వెల్ రాజా ఎన్నుకున్న సబ్జెక్టు ప్రస్తుతం ఇండియా లో బర్నింగ్ టాపిక్ మీద ఆధారం చేసుకున్నది అవ్వడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వర్కౌట్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు బలమైన నమ్మకంతో ఉన్నారు. మరి ఆ నమ్మకాన్ని ఈ చిత్రం కమర్షియల్ గా నిలబెడుతుందో లేదో చూడాలి. టాక్ డీసెంట్ గానే వచ్చింది కాబట్టి సూపర్ స్టార్ ఓపెనింగ్స్ దంచికొట్టేస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు, లాంగ్ రన్ కూడా అదే స్థాయిలో ఉంటుందా అనేది నేటి సాయంత్రానికి స్థిరపడిన టాక్ ని చూస్తే తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ట్విట్టర్ నుండి వచ్చిన రివ్యూస్ ని మీకోసం కొన్ని క్రింద అందిస్తున్నాము చూడండి.